• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU DIVI ELIMINATION MAKES NETIZENS FIRE ON THE REALITY SHOW PK

Bigg Boss 4 Divi Elimination: దివి ఎలిమినేటెడ్.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన విమర్శలు..

Bigg Boss 4 Divi Elimination: దివి ఎలిమినేటెడ్.. సోషల్ మీడియాలో మళ్లీ మొదలైన విమర్శలు..

దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)

Bigg Boss 4 Divi Elimination: బిగ్ బాస్ సీజన్ 4లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అస్సలు పోరు అనుకున్న వాళ్లే బయటికి వచ్చేస్తున్నారు. వీళ్లు స్ట్రాంగ్ అనుకుంటున్న కంటెస్టెంట్స్ వరసగా..

  • Share this:
బిగ్ బాస్ సీజన్ 4లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అస్సలు పోరు అనుకున్న వాళ్లే బయటికి వచ్చేస్తున్నారు. వీళ్లు స్ట్రాంగ్ అనుకుంటున్న కంటెస్టెంట్స్ వరసగా ఇంటి నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. మూడో వారం నుంచే ఇది జరుగుతుంది. దేవి నాగవల్లి ఎలిమినేషన్ నుంచి ఈ రచ్చ మొదలైంది. మూడో వారమే కావాలని ఆమెను బయటికి పంపేసారని వాదన మొదలైంది. బిగ్ బాస్‌లో ఆమె నుంచి కంటెంట్ రావడం లేదని.. అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందంటూ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత వారం గంగవ్వ సొంతంగా బయటికి వచ్చినా కూడా స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ కూడా షాకింగ్ అనిపించింది. సుజాత పర్లేదనే టాక్ వచ్చినా కూడా మళ్లీ కుమార్ సాయి దగ్గరికి వచ్చేసరికి అసలు మంటకు శ్రీకారం పడింది. ఎందుకంటే మోనాల్‌ను సేవ్ చేయడానికి కుమార్ సాయిని బలవంతంగా బయటికి గెంటేసారంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)
దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)

ఈ వారం కూడా ఇదే జరిగింది. ఈసారి కూడా మోనాల్‌ను సేవ్ చేయడానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన దివిని బయటికి పంపేసారని ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు దివి ఎలిమినేట్ అవుతుందని ఈ వారం కనీసం ఎవరూ ఊహించలేదు. ఆమె కంటే మోనాల్ చాలా వీక్ అని చాలా మంది ఊహించారు. అయితే అఖిల్‌తో ప్రేమాయణం సాగిస్తుందనే ఒకే ఒక్క కారణంతోనే ఆమెను సేవ్ చేస్తున్నారని.. పైగా అందాలు ఆరబోస్తుంది కాబట్టి అక్కడే ఉంచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా దివి ఎలిమినేషన్‌తో మరోసారి బిగ్ బాస్‌పై విమర్శలు భారీగానే వస్తున్నాయి. మరి వచ్చే వారం నుంచి ఎలిమినేషన్స్ ఇంకెలా ఉండబోతున్నాయో..?
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు