Home /News /movies /

BIGG BOSS 4 TELUGU BOLD BABY ARIYANA AND HARIKA GETS ELIMINATED FROM FINALE PK

Bigg Boss 4 Telugu: అరియానా, హారిక ఎలిమినేటెడ్.. బిగ్ బాస్ టైటిల్ రేసులో ముగ్గురు అబ్బాయిలు..

బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 telugu)

బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 telugu)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 మరికొన్ని గంటల్లోనే పూర్తి కానుంది. ఈ సారి టాప్ 5 కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. హారిక మినహాయిస్తే మిగిలిన నలుగురు టాప్‌లోనే ఉన్నారు. ఎవరికి వాళ్లు సొంతంగా ఆడుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన..

బిగ్ బాస్ 4 మరికొన్ని గంటల్లోనే పూర్తి కానుంది. ఈ సారి టాప్ 5 కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. హారిక మినహాయిస్తే మిగిలిన నలుగురు టాప్‌లోనే ఉన్నారు. ఎవరికి వాళ్లు సొంతంగా ఆడుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. హారిక మాత్రమే కేరాఫ్ అభిజీత్ అనే ముద్ర వేయించుకుంది. మిగిలిన వాళ్లలో అరియానా సొంతంగానే తన ఆటను మెరుగుపరుచుకుంటూ వచ్చింది. ఒక్కో వారం తన ఆటలో చాలా తేడా చూపించి అభిమానులను పెంచుకుంది. ఇక సోహెల్ గురించి ఏం చెప్పాలి..? ఈయన కూడా తనదైన ఆటతో బాగానే ఆకట్టుకున్నాడు. కోపంతో పాటు ఆలోచనల, ప్రేమ అన్నీ చూపిస్తూ అందరి మనసులు గెలుచుకున్నాడు. అఖిల్ కూడా మోనాల్ విషయంలో మినహాయిస్తే అన్నింట్లోనూ సూపర్ అనిపించుకున్నాడు. అభిజీత్ అయితే మిస్టర్ కూల్. ఈ సారి విన్నర్ ఈయనే అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సారి కూడా అబ్బాయే విన్నర్ కానున్నాడనే విషయం మాత్రం స్పష్టమైపోయింది. డిసెంబర్ 20న బిగ్ బాస్ 4 తెలుగు ఫైనల్ జరగనుంది. అదే రోజు ఉదయం షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
అరియానా గ్లోరీ (Ariyana Glory)

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అయితే హారిక, అరియానా బయటికి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ బాస్ లీక్స్ వచ్చేసాయి. హారిక ఐదో స్థానంలో.. అరియానా నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నారు. దాంతో టాప్ 3లో అబ్బాయిలే ఉన్నారిప్పుడు. ఇప్పుడు ఇక అభిజీత్, అఖిల్, సోహెల్‌లలో ఎవరు విన్నర్ అవుతారనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు