Home /News /movies /

BIGG BOSS 4 TELUGU AVINASH GOT ELIMINATED THIS WEEK AND LOOK HOW HE GETS OUT OF IT PK

Bigg Boss 4 Avinash Eliminated: అవినాష్ ఎలిమినేటెడ్.. బిగ్ బాస్‌లో కథ వేరే ఉంటది..!

జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)

జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)

Bigg Boss 4 Avinash Eliminated: అవును.. ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. నామినేషన్ అంటేనే కిలోమీటర్ దూరం భయపడి పారిపోయే అవినాష్‌కు ఈ వారం నిజంగానే అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఈయన ఎలిమినేట్..

అవును.. ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. నామినేషన్ అంటేనే కిలోమీటర్ దూరం భయపడి పారిపోయే అవినాష్‌కు ఈ వారం నిజంగానే అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఈయన ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఇంటి నుంచి మాత్రం బయటికి వెళ్లడం లేదు. దానికి కారణం ఎవిక్షన్ ఫ్రీ పాస్. ఈయన చేతిలో ఉన్న వజ్రాయుధం అది. దాంతో ఈ వారం ఇంటి నుంచి ఎవరూ వెళ్లడం లేదు. ఎలిమినేషన్ ప్రక్రియ జరిగినా కూడా అది ఉత్తుత్తిదే అయిపోయింది. మరో నాలుగు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సమయంలో ఎవరు బయటికి వెళ్తారు.. ఎవరు ఇంట్లో ఉంటారనే విషయంపై చాలా ఆసక్తికరమైన చర్చలే జరుగుతున్నాయి బయట. ప్రస్తుతానికి టాప్ 7 కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్నారు. అందులో అభిజీత్, హారిక, అఖిల్, మోనాల్, సోహైల్, అవినాష్, అరియానా ఉన్నారు. వాళ్లలో ఈ వారం అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ నామినేట్ అయ్యారు. ఇప్పటికే ఈ వారం వచ్చిన ఓట్లను బట్టి చూస్తే అఖిల్, మోనాల్ టాప్ 2లో ఉన్నారు. ఈ ఇద్దరూ ఈజీగా సేవ్ అయిపోయారు.

bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash elimination,bigg boss 4 telugu avinash used eviction free pass from elimination,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu trolls,bigg boss telugu trolls,bigg boss 4 telugu elimination today,bigg boss 4 telugu elimination this week,bigg boss 4 telugu 12th week elimination,bigg boss 4 telugu episode 80 review,bigg boss 4 telugu avinash eliminated,అవినాష్ ఎలిమినేటెడ్,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్ ఎలిమినేషన్
బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)


అరియానా కూడా అవినాష్ కంటే మెరుగైన ఓట్లతో సేవ్ అయిపోయింది. చివరగా అవినాష్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో మనోడు ఎలిమినేట్ అయిపోయాడు. అనుక్షణం నామినేషన్ అంటే వణికిపోయే అవినాష్‌కు ఇది నిజంగా షాకే. అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి తనను తాను సేవ్ చేసుకున్నాడు అవినాష్.

bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash elimination,bigg boss 4 telugu avinash used eviction free pass from elimination,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu trolls,bigg boss telugu trolls,bigg boss 4 telugu elimination today,bigg boss 4 telugu elimination this week,bigg boss 4 telugu 12th week elimination,bigg boss 4 telugu episode 80 review,bigg boss 4 telugu avinash eliminated,అవినాష్ ఎలిమినేటెడ్,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్ ఎలిమినేషన్
అరియానా వర్సెస్ అవినాష్ (Ariyana Avinash)


అలా ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బయటికి వెళ్లలేదు. దాంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత నాలుగు వారాల్లో రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి.. చివరి రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. అందులోంచి ముగ్గురు వెళ్లిపోయి టాప్ 2 మిగులుతారు. టాప్ 2ను స్టేజీపై పిలిచి వాళ్లలో విజేత ఎవరో ప్రకటిస్తారు. అలా 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ లేకుండానే ముగించేస్తున్నారు నిర్వాహకులు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Jabardasth avinash, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు