Home /News /movies /

BIGG BOSS 4 TELUGU AVINASH GETS ELIMINATED IN 12TH WEEK BUT SAVED WITH EVICTION FREE PASS PK

Bigg Boss 4 Avinash Eliminated: ఆడియన్స్ ఫెయిల్ చేసారు.. బిగ్ బాస్ ‘పాస్’ చేసాడు..

జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)

జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)

Bigg Boss 4 Avinash Eliminated: అవును.. ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. నామినేషన్ అంటేనే కిలోమీటర్ దూరం భయపడి పారిపోయే అవినాష్‌కు ఈ వారం నిజంగానే అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఈయన ఎలిమినేట్..

అవును.. ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. నామినేషన్ అంటేనే కిలోమీటర్ దూరం భయపడి పారిపోయే అవినాష్‌కు ఈ వారం నిజంగానే అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఈయన ఎలిమినేట్ అయిపోయాడు. కానీ ఇంటి నుంచి మాత్రం బయటికి వెళ్లడం లేదు. దానికి కారణం ఎవిక్షన్ ఫ్రీ పాస్. ఈయన చేతిలో ఉన్న వజ్రాయుధం అది. దాంతో ఈ వారం ఇంటి నుంచి ఎవరూ వెళ్లడం లేదు. ఎలిమినేషన్ ప్రక్రియ జరిగినా కూడా అది ఉత్తుత్తిదే అయిపోయింది. మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సమయంలో ఎవరు బయటికి వెళ్తారు.. ఎవరు ఇంట్లో ఉంటారనే విషయంపై చాలా ఆసక్తికరమైన చర్చలే జరుగుతున్నాయి బయట. ఈ క్రమంలోనే అంతా ఊహించినట్లుగానే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. తనకు కూడా ఈ వారం ఉంటానని నమ్మకం లేదు. అన్నట్లుగానే అరియానా, అఖిల్, మోనాల్ నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో మనోడు బయటపడిపోయాడు.

bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash elimination,bigg boss 4 telugu avinash used eviction free pass from elimination,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu trolls,bigg boss telugu trolls,bigg boss 4 telugu elimination today,bigg boss 4 telugu elimination this week,bigg boss 4 telugu 12th week elimination,bigg boss 4 telugu episode 80 review,bigg boss 4 telugu avinash eliminated,అవినాష్ ఎలిమినేటెడ్,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్ ఎలిమినేషన్
బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)


అరియానా కూడా అవినాష్ కంటే మెరుగైన ఓట్లతో సేవ్ అయిపోయింది. చివరగా అవినాష్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో మనోడు ఎలిమినేట్ అయిపోయాడు. అనుక్షణం నామినేషన్ అంటే వణికిపోయే అవినాష్‌కు ఇది నిజంగా షాకే. అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి తనను తాను సేవ్ చేసుకున్నాడు అవినాష్. ఎలిమినేట్ అయ్యావ్ అని నాగార్జున చెప్పిన తర్వాత అసలు కథ మొదలు పెట్టాడు అవినాష్. ఇప్పుడు నేను గేమ్‌లో ముందుకెళ్లాలా ఆగిపోవాలా అంటూ నాగార్జునను అడిగాడు. ప్రేక్షకులు ఎలిమినేట్ చేసారు ఇంకేం చేయాలంటూ కొత్త కహానీ వినిపించాడు.

bigg boss 4 telugu,bigg boss 4 telugu avinash elimination,bigg boss 4 telugu avinash used eviction free pass from elimination,bigg boss 4 telugu latest promo,bigg boss 4 telugu trolls,bigg boss telugu trolls,bigg boss 4 telugu elimination today,bigg boss 4 telugu elimination this week,bigg boss 4 telugu 12th week elimination,bigg boss 4 telugu episode 80 review,bigg boss 4 telugu avinash eliminated,అవినాష్ ఎలిమినేటెడ్,బిగ్ బాస్ 4 తెలుగు అవినాష్ ఎలిమినేషన్
అరియానా వర్సెస్ అవినాష్ (Ariyana Avinash)


అవినాష్ మాటలకు నాగార్జున తిరిగి క్లాస్ తీసుకున్నాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేయకముందు ఈ మాట అనుంటే మాట్లాడేవాడిని కానీ పాస్ యూజ్ చేసిన తర్వాత ఇలా మాట్లాడితే ఏంటి అర్థం అంటూ అవినాష్‌కు క్లాస్ పీకాడు. అయినా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటి అంటూ అప్పుడే అవినాష్‌పై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఇకపై ఉన్న మూడు వారాల్లో రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి.. చివరి రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. అందులోంచి ముగ్గురు వెళ్లిపోయి టాప్ 2 మిగులుతారు. టాప్ 2ను స్టేజీపై పిలిచి వాళ్లలో విజేత ఎవరో ప్రకటిస్తారు. అలా 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ లేకుండానే ముగించేసారు నిర్వాహకులు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Jabardasth avinash, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు