BIGG BOSS 4 TELUGU AVINASH GETS ELIMINATED FROM HOUSE IN 13TH WEEK PK
Bigg Boss 4 Avinash Eliminated: ఊహించిందే.. మోనాల్ సేఫ్.. అవినాష్ ఎలిమినేటెడ్..
అవినాష్ (Avinash Eliminated)
Bigg Boss 4 Avinash Eliminated: ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. నామినేషన్ అంటేనే కిలోమీటర్ దూరం భయపడి పారిపోయే అవినాష్‌కు ఈ వారం నిజంగానే అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఈయన ఎలిమినేట్ అయిపోయాడు.
ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. నామినేషన్ అంటేనే కిలోమీటర్ దూరం భయపడి పారిపోయే అవినాష్‌కు ఈ వారం నిజంగానే అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో ఈయన ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి గత వారమే ఎలిమినేట్ అయినా కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా సేవ్ అయిపోయాడు. కానీ ఈ వారం మాత్రం అలాంటివేం లేవు. దాంతో నిజంగానే ఇంటి నుంచి బయటికి వచ్చేసాడు ఈయన. మోనాల్‌తో చివరి వరకు పోటీ పడిన ఈయనకు ఓట్ల విషయంలో అందరికంటే తక్కువగా వచ్చాయి. ప్రస్తుతానికి టాప్ 6 కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్నారు. అందులో అభిజీత్, హారిక, అఖిల్, మోనాల్, సోహైల్, అరియానా ఉన్నారు. వాళ్లలో వచ్చే వారం మోనాల్ ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అఖిల్ ఫినాలేకు చేరిపోయాడు. సోహైల్ చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. హారిక, అరియానా, అభిజీత్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రతీవారం చివరి నిమిషంలో సేవ్ అవుతున్న మోనాల్.. వచ్చే వారం మాత్రం కచ్చితంగా బయటికి వచ్చేలా కనిపిస్తుంది.
అవినాష్ మోనాల్ గజ్జర్ (avinash monal gajjar)
ఆట మరో రెండు వారాలు మాత్రమే ఉండటంతో ఒక్కర్ని ఎలిమినేట్ చేసి టాప్ 5 కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయనున్నారు. అందులోంచి ముగ్గురు వెళ్లిపోయి టాప్ 2 మిగులుతారు. టాప్ 2ను స్టేజీపై పిలిచి వాళ్లలో విజేత ఎవరో ప్రకటిస్తారు. మొత్తానికి ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్, అభిజీత్ మధ్య పోరు నడుస్తుంది. అందులో అభిజీత్ విన్నర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఏదేమైనా వైల్డ్ కార్డుతో రెండో వారం ఇంట్లోకి వచ్చిన అవినాష్ 12 వారాల బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.