• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU ARIYANA TARGETED BY HOUSEMATES THIS WEEK NOMINATIONS PK

Bigg Boss 4 Ariyana: అరియానానే అందరి టార్గెట్.. బయటికి పంపేయాలని చూస్తున్నారా..?

Bigg Boss 4 Ariyana: అరియానానే అందరి టార్గెట్.. బయటికి పంపేయాలని చూస్తున్నారా..?

బిగ్ బాస్ 4 అరియానా (bigg boss 4 telugu ariyana)

Bigg Boss 4 Ariyana: బిగ్ బాస్ 4 తెలుగులో చాలా డ్రామాలు జరుగుతున్నాయి. దానికితోడు సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ రచ్చ జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అయితే ప్రతీవారం కూడా ఒక్కరు మాత్రం..

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో చాలా డ్రామాలు జరుగుతున్నాయి. దానికితోడు సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ రచ్చ జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అయితే ప్రతీవారం కూడా ఒక్కరు మాత్రం కామన్ టార్గెట్ అయిపోతుంటారు. గతవారం చాలా మంది అమ్మ రాజశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని రచ్చ చేసారు.. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఈ వారం అరియానాను టార్గెట్ చేసారు చాలా మంది. ఒక్కరు ఇద్దరు కాదు.. అవినాష్ తప్ప అంతా ఈమెనే నామినేట్ చేసినట్లు ప్రోమో చూస్తుంటే అర్థమైపోతుంది. హారిక, మోనాల్‌, సోహెల్ అయితే అరియానాతో గొడవ పెట్టుకున్నారు కూడా. అరవొద్దు అరియానా అంటే నేనింతే అరుస్తా అంటూ సమాధానమిచ్చింది. మరోవైపు మోనాల్‌ను ఫేక్ అంటూ సంచలన కామెంట్స్ చేసింది. సోహెల్‌ను కూడా టార్గెట్ చేసి అరిచేసింది. అలా అందర్నీ బాగానే ఆడేసుకుంది అరియానా. అయితే వాళ్లంతా రివర్స్‌లో అరియానాను టార్గెట్ చేసారు. గేమ్‌లో మరీ రూడ్‌గా ఉంటుందనే ఆరోపణ చాలా రోజుల నుంచి అరియానాపై ఉంది.
bigg boss 4 telugu,bigg boss 4 telugu ariyana,bigg boss 4 telugu ariyana target,bigg boss 4 telugu ariyana hot,bigg boss 4 telugu ariyana elimination,bigg boss 4 telugu ariyana nomination,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అరియానా,అరియానా ఎలిమినేషన్,అరియానా నామినేషన్స్
బిగ్ బాస్ 4 అరియానా (bigg boss 4 telugu ariyana)

ఒక్కసారి టాస్క్ వచ్చిందంటే చాలు రెచ్చిపోయి ఆడుతుంది అరియానా. పక్కన ఎవరున్నారనే విషయం కూడా పట్టించుకోదు. తనకు కావాల్సిన వాళ్లను సేవ్ చేస్తుంది కానీ వద్దు అనుకున్న వాళ్లపై మాత్రం విరుచుకుపడుతుంది. గతవారం మోనాల్ దగ్గర అరియానా చేసిన రచ్చ చూస్తుంటే వామ్మో అనుకుంటారు. ఐస్ వాటర్ తీసుకుని ఏకంగా మొహంపై బలంగా కొట్టేసింది అరియానా. ఆ తర్వాత నాగార్జున కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. అమ్మ రాజశేఖర్ వెళ్లిపోయిన తర్వాత అరియానా ఇచ్చిన రియాక్షన్స్ కూడా బాగానే పేలాయి.

అన్నింటికి తోడు ఇంట్లో అవినాష్ తప్ప మరో కంటెస్టెంట్ లేనట్లు అందరితోనూ సున్నం పెట్టుకుంది అరియానా. దాంతో అంతా ఒకేసారి ఈమెను టార్గెట్ చేసారు. మరి 10వ వారం ఈమె ఎంతవరకు సేవ్ అవుతుందో చూడాలిక. ఆమెతో పాటు హారిక, అభిజీత్, మోనాల్ కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉండేలా కనిపిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు