Bigg Boss 4 Telugu: ఇస్మార్ట్ సోహైల్‌ను చూపులతోనే వణికించిన అరియానా..

Bigg Boss 4 Sohail Ariyana: బిగ్ బాస్ 4 తెలుగులో టామ్ అండ్ జెర్రీ అంటే ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు సోహైల్ అండ్ అరియానా. ఈ ఇద్దరూ సీక్రేట్ రూమ్ నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అందరిలా ముందు ఇంట్లోకి రాకుండా రెండు రోజులు సీక్రేట్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2020, 8:56 PM IST
Bigg Boss 4 Telugu: ఇస్మార్ట్ సోహైల్‌ను చూపులతోనే వణికించిన అరియానా..
బిగ్ బాస్ 4 తెలుగు అరియానా సోహైల్ (bigg boss 4 telugu ariyana sohail)
  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో టామ్ అండ్ జెర్రీ అంటే ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు సోహైల్ అండ్ అరియానా. ఈ ఇద్దరూ సీక్రేట్ రూమ్ నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అందరిలా ముందు ఇంట్లోకి రాకుండా రెండు రోజులు సీక్రేట్ రూమ్‌లో ఉండి ఆ తర్వాత జాయిన్ అయ్యారు. దాంతో అప్పట్నుంచీ ఈ ఇద్దరి మధ్య ఫైటింగ్స్ మొదలయ్యాయి. చిలిపి తగాదాలతో ఎప్పుడూ బిగ్ బాస్ హౌజ్‌లో రచ్చ చేస్తూనే ఉంటారు. ఒక్కోసారి వీళ్ల గొడవలు సీరియస్ కూడా అయ్యాయి.. ఇంకా అవుతున్నాయి కూడా. ఆ మధ్య ఓ సారి నామినేషన్స్‌లో తన ఫ్రెండ్స్ లిస్టులోంచి అరియానాను తీసేసాడు సోహైల్. మరోవైపు సోహైల్‌ను కూడా ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటుంది అరియానా. ఈ ఇద్దరి టామ్ అండ్ జెర్రీ వార్ బిగ్ బాస్‌లో చాలా కంటెంట్ ఇస్తుంటుంది కూడా. ఎన్ని గొడవలు పడినా కూడా ఇప్పుడు మళ్లీ కలిసిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నామినేషన్ ప్రిక్రియలో భాగంగా మరోసారి ఈ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగింది.

అందుకే టామ్ అండ్ జెర్రీ అంటూ బిగ్ బాస్ కూడా కేవలం ఈ ఇద్దరిపైనే ప్రోమో విడుదల చేసాడు. అందులో అరియానా చూపులతోనే సోహైల్‌ను భయపెట్టింది.. ఇంకా చెప్పాలంటే వణికించింది కూడా. అరియానా చూపులు చూసి అమ్మా తల్లి నువ్వలా చూడకు.. నాకు భయమైతుంది.. ప్లీజ్ అలా చూడకంటూ వేడుకున్నాడు సోహైల్. ఇంట్లో నువ్వు నేను టామ్ అండ్ జెర్రీ అని అందరికీ తెలుసు.. నువ్వు టామ్ అయితే నేనెప్పటికీ జెర్రీనే అంటూ చెప్పుకొచ్చాడు సోహైల్. అసలు విషయం ఏంటంటే ఈ వారం అరియానాను మళ్లీ నామినేట్ చేసాడు సోహైల్. దాంతో అరియానా అలా చూస్తుండిపోయింది. మొత్తానికి చూడాలిక.. అసలు ఈ ఇద్దరి మధ్య కాంటెస్ట్ ఎలా ఉండబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: October 26, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading