• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU ARIYANA GLORY FEELS SHE TARGETED AND CRIED FOR WANTS TO GO HOME PK

Bigg Boss 4 Ariyana: నేనెళ్లిపోతా పంపించేయండి బిగ్ బాస్.. కెమెరా ముందు అరియానా ఆవేదన..

Bigg Boss 4 Ariyana: నేనెళ్లిపోతా పంపించేయండి బిగ్ బాస్.. కెమెరా ముందు అరియానా ఆవేదన..

భోరున ఏడ్చిన బోల్డ్ పాప అరియానా (Ariyana Bigg Boss 4 Telugu)

Bigg Boss 4 Ariyana Glory: బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో అసలు ఎమోషన్స్ లేని.. జాలి దయ కరుణ లేని.. సుత్తి లేకుండా మాట్లాడే స్ట్రెయిట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది అరియానా మాత్రమే. ఏమనిపిస్తే అది మొహంమీదే..

  • Share this:
బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో అసలు ఎమోషన్స్ లేని.. జాలి దయ కరుణ లేని.. సుత్తి లేకుండా మాట్లాడే స్ట్రెయిట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది అరియానా మాత్రమే. ఏమనిపిస్తే అది మొహంమీదే చెప్పేస్తుంది ఈ బ్యూటీ. అవతలి వాళ్లు ఏమనుకుంటారు అనే కనీస ఆలోచన కూడా ఈ భామలో కనిపించదు. తాను బిగ్ బాస్‌కు గేమ్ ఆడటానికి వచ్చాను.. ఆడుతున్నాను.. ఎవరేం అనుకుంటే నాకేంటి అంటుంది అరియానా. ఇన్ని రోజులు అలాగే ఆడింది.. కాబట్టే ఇప్పుడు ఇంటి సభ్యులందరూ ఈమెను టార్గెట్ చేసారు. ఎంతగా అంటే పదో వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యుల్లో అరియానా ముందుంది. హౌజ్‌లో 9 మంది ఉంటే.. అందులో ఒక్క అవినాష్ తప్ప మిగిలిన ఏడుగురు అరియానాను నామినేట్ చేసారు. ఆమె ఆటిట్యూడ్‌తోనే అందరికీ ప్రాబ్లమ్. ఎందుకంటే మాటతీరుతోనే అందరికీ మండిపోయేలా చేస్తుంది ఈ బ్యూటీ.

bigg boss 4 telugu,bigg boss 4 telugu ariyana,bigg boss 4 telugu ariyana crying,bigg boss 4 telugu ariyana elimination crying,bigg boss 4 telugu ariyana target,bigg boss 4 telugu ariyana hot,bigg boss 4 telugu ariyana elimination,bigg boss 4 telugu ariyana nomination,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అరియానా,అరియానా ఎలిమినేషన్,అరియానా నామినేషన్స్,కెమెరా ముందు ఏడ్చేసిన అరియానా
బిగ్ బాస్ 4 అరియానా (bigg boss 4 telugu ariyana)


అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత చంద్రముఖిలోంచి గంగ బయటికి వచ్చినట్లు అరియానా లోంచి అమ్మాయి బయటికి వచ్చింది.. ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. అంతే కెమెరా ముందుకొచ్చి లబాలబా ఏడ్చేసింది. బిగ్ బాస్ నేనిక్కడ ఉండలేకపోతున్నా.. నన్ను పంపించేయండి బిగ్ బాస్.. నేను ఒంటరి అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది.. నా లైఫ్‌లో ఇలాంటి మనుషులను ఎప్పుడూ చూడలేదు.. నేనిక్కడ ఉండలేకపోతున్నా.. నేను మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు బిగ్ బాస్.. నా వల్ల కావట్లేదు.. దయచేసి నన్ను పంపేయండి బిగ్ బాస్ అంటూ వేడుకుంది. అది కూడా ఏడుస్తూ దీనంగా వేడుకుంది అరియానా.

 bigg boss 4 telugu,bigg boss 4 telugu ariyana,bigg boss 4 telugu ariyana crying,bigg boss 4 telugu ariyana elimination crying,bigg boss 4 telugu ariyana target,bigg boss 4 telugu ariyana hot,bigg boss 4 telugu ariyana elimination,bigg boss 4 telugu ariyana nomination,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు అరియానా,అరియానా ఎలిమినేషన్,అరియానా నామినేషన్స్,కెమెరా ముందు ఏడ్చేసిన అరియానా
బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory/Instagram)


ఇక్కడ అంతా తనను టార్గెట్ చేసారని.. ఇలాంటి మనుషుల మధ్య తాను ఉండలేకపోతున్నాననంటూ గట్టిగా ఏడ్చేసింది. పక్కనే అవినాష్ ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా కూడా పట్టించుకోవడం లేదు అరియానా. వద్దు నేను వెళ్లిపోతానంటూ ఏడ్చేసింది. ఈ సీన్ అంతా నామినేట్ చేసిన రాత్రి జరిగింది. మళ్లీ పొద్దున్నే లేచే వరకు అసలు ఏం జరగనట్లే ఉంది. పొద్దున్నే మళ్ళీ చంద్రముఖి కాస్తా గంగగా మారిపోయింది. ఏం జరగలేదన్నట్లు డాన్సులు చేసింది.

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory/Instagram)


అది చూసి ఆడియన్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఈ పిల్లే కదా రాత్రి కెమెరా ముందుకొచ్చి నేనుండను బిగ్ బాస్.. వెళ్లిపోతా అంటూ ఏడ్చింది. మళ్లీ పొద్దున్నే లేచి ఇలా డాన్సులేస్తుంది ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా కూడా అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ తర్వాత అరియానాకు ఇప్పుడు ఇంట్లో మిగిలిన ఒకేఒక్క స్నేహితుడు అవినాష్ మాత్రమే. కొంపదీసి ఆయన గానీ ఎలిమినేట్ అయ్యాడంటే ఒక్క రోజు కూడా అక్కడ ఉండలేదు ఈ ముద్దుగుమ్మ.. ఇది మాత్రం ఖాయం.
Published by:Praveen Kumar Vadla
First published: