బిగ్ బాస్ 4 తెలుగులో చాలా మంది కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చారు. కానీ అందరికి తెలిసిన మొహం మాత్రం లాస్యనే. ముందు నుంచి కూడా ఈమెకు మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్‌లో యాంకర్‌గా ప్రస్థానం మొదలు పెట్టి నటిగా కూడా రెండు మూడు సినిమాలు చేసింది లాస్య. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బుల్లితెరకు దూరమైంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 4 తెలుగుతో మళ్లీ ప్రేక్షకులకు చేరువవుతుంది లాస్య. ఇంట్లో అందరితోనూ సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది లాస్య. వీకెండ్ వచ్చినపుడు నాగార్జున కూడా ఈమెతో ఆడుకుంటాడు. ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే లాస్యలో మరికొన్ని కోణాలు కూడా ఉన్నాయంటూ కొందరు కంటెస్టెంట్స్ ఇప్పటికే చెప్పారు. అమ్మ రాజశేఖర్ అయితే ఎలిమినేట్ అయ్యే వరకు కూడా లాస్య నవ్వులో మోసం ఉందని చెప్పాడు. అఖిల్ కూడా లాస్యను కొన్నిసార్లు తప్పు పట్టాడు. ఇదిలా ఉంటే ఈమెను ఇంట్లో సోహైల్, అవినాష్ లాంటి కంటెస్టెంట్స్ అప్పుడప్పుడూ ఆంటీ అంటూ వెక్కిరిస్తూ ఉంటారు.
లాస్య కూడా తనకు తాను ఆంటీ అని చెప్పుకుంటుంది. ఎందుకమ్మా నువ్వు ఆంటీ అని ఒప్పుకున్నావ్.. అలా అన్నపుడు కాదని చెప్పొచ్చుగా అని నాగార్జున అంటే కూడా అదేంటి సర్.. నేను ఆంటీనేగా అంటూ చెప్పింది. ఆ తర్వాత మరింత ఎక్కువ ఆట పట్టిస్తున్నారు సోహైల్, అవినాష్. ఏంటి ఏంటి ఆంటీ అంటూ బాగానే ఆడుకుంటారు ఆమెను. అలా అనొద్దు అంటే కూడా అనేసి నవ్వుతుంటారు. ఇప్పుడు ఇంట్లోకి కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఇప్పటికే అఖిల్, అవినాష్, హారిక, అభి వాళ్ల కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత లాస్య, అరియానా, సోహైల్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.
అందులో భాగంగానే లాస్య ఇంటి నుంచి ఆమె భర్త మంజునాథ్ సహా కొడుకు జున్ను కూడా వచ్చాడు. వాడితో కాసేపు ఇంటి సభ్యులంతా ఆడుకున్నారు. ఆ తర్వాత మంజునాథ్ మాట్లాడుతూ అందరికీ సలహాలు ఇచ్చాడు. ఇక లాస్య తనను అంతా ఆంటీ అంటూ ఆట పట్టిస్తున్నారని మంజుకు చెప్తే.. మనోడు వేలు చూపించాడు. ఏంటి ఏంటి ఆంటీ అంటూ ఆడుకుంటే అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే అది మరీ సీరియస్ వార్నింగ్ కాదులెండీ.. సరదాగానే ఇచ్చాడు. అది చూసి అక్కడున్న వాళ్లంతా మరోసారి మనసారా నవ్వుకున్నారు. అందరూ బాగా ఆడుతున్నారు.. అలాగే ఆడండి అంటూ చెప్పుకొచ్చాడు మంజునాథ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.