Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 6, 2020, 10:06 PM IST
అమ్మ రాజశేఖర్ (amma rajasekhar)
బిగ్ బాస్ 4 తెలుగు మొదలైన తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అమ్మ రాజశేఖర్ మాత్రం కాస్త వెనకాలే ఉన్నాడు. ఇంట్లో అఖిల్, అభిజీత్, సోహెల్ లాంటి కుర్రాళ్ల మధ్య ఈయన పోటీ తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు నేను ఇది అంటూ చెప్పుకోడానికి ఒక్కటి కూడా చేయలేదు అమ్మ. ఆ మద్య ఒక్కసారి నామినేషన్ నుంచి సేవ్ కావడానికి అరగుండు కొట్టించుకోవడం తప్ప. పైగా దివి వెళ్లిపోయిన తర్వాత అమ్మ రాజశేఖర్ ఆట మరింత దారుణంగా మారిపోయింది. ఈయన కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంట్లో అందరిపై అరిచేస్తున్నాడు.. అభిజీత్, హారికను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు ఈయన. నోయల్ వెళ్తూ వెళ్తూ చేసిన కామెంట్స్ మనసులో పెట్టుకుని రచ్చ రచ్చ చేసాడు అమ్మ రాజశేఖర్. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఇంటి కెప్టెన్ అయ్యాడు అమ్మ రాజశేఖర్. అయిన వెంటనే తనను ఎవరైతే టార్గెట్ చేసారో వాళ్లందర్నీ గుర్తు పెట్టుకున్నాడు అమ్మ. అభిజీత్, హారికతో పాటు సోహెల్‌ను కూడా బాగానే టార్గెట్ చేసాడు.

అమ్మ రాజశేఖర్ (amma rajasekhar)
అయితే ఈ వారం నామినేషన్స్‌లో డేంజర్ జోన్లో ఉన్నది అమ్మనే. 9వ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి అభిజీత్, హారిక, మోనాల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ నామినేట్ అయ్యారు. అందులో కచ్చితంగా అవినాష్, అభిజీత్, హారిక సేవ్ అయ్యేలా కనిపిస్తున్నారు. మరోవైపు మోనాల్ కూడా సేవ్ అయ్యేలాగే కనిపిస్తుంది. అఖిల్ నుంచి విడిపోయిన తర్వాత అభితో జోడీ కట్టింది ఈ బ్యూటీ.

అమ్మ రాజశేఖర్ Vs అభిజిత్ (Star Maa/Photo)
దానికితోడు గ్లామర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మోనాల్ ఈ వారం కూడా సేవ్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే కానీ జరిగితే ఈ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అవుతాడు. కెప్టెన్‌గా ఉండి ఇంటి నుంచి బయటికి వెళ్లడం అనేది చిన్న విషయం కాదు. ఇదే కానీ జరిగితే అరుదైన రికార్డు అమ్మ రాజశేఖర్ సొంతం అవుతుంది. చూడాలిక.. ఏం జరగబోతుందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
November 6, 2020, 10:06 PM IST