• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • BIGG BOSS 4 TELUGU AMMA RAJASEKHAR TAKEN A SENSATIONAL DECISION TO SAVE FROM NEXT NOMINATION PK

Bigg Boss 4 Amma Rajasekhar: నామినేషన్స్‌లో సేవ్ అవ్వడం కోసం అమ్మ రాజశేఖర్ సంచలనం..

బిగ్ బాస్ 4 అమ్మ రాజశేఖర్ (bigg boss amma rajasekhar)

Bigg Boss 4 Amma Rajasekhar: బిగ్ బాస్ 4 తెలుగులో రోజురోజుకీ టాస్కులు మరీ పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి పెద్దాయన ఇచ్చే టాస్కులు చూసి అక్కడున్న వాళ్లే కాదు బయట ప్రేక్షకులు కూడా భయపడుతున్నారు. వామ్మో ఏంటీ టాస్కులు..

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో రోజురోజుకీ టాస్కులు మరీ పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి పెద్దాయన ఇచ్చే టాస్కులు చూసి అక్కడున్న వాళ్లే కాదు బయట ప్రేక్షకులు కూడా భయపడుతున్నారు. వామ్మో ఏంటీ టాస్కులు.. కెప్టెన్సీ కోసం.. లగ్జరీ బడ్జెట్ కోసం మరీ ఇంతగా చేయాలా అనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఓ టాస్కులో భాగంగా డీల్ అంటూ ఒంటిపై బట్టలన్నీ విప్పించేసాడు బిగ్ బాస్. దాంతో పాటు హారిక జుట్టు కూడా కట్ చేసుకుంది. అభిజీత్ తన బట్టలతో పాటు అన్నీ ఇచ్చేసాడు. ఇలా ఒక్కో టాస్క్ మరీ హై రేంజ్‌కు చేరిపోతుంది. అందులో భాగంగానే ఓ డీల్‌లో ఏకంగా అరగుండు కొట్టించుకోవాలి. దానికి ఎవరూ ఒప్పుకోలేదు కూడా. ఇంట్లో ఉన్న ఎవరో ఒక మగ కంటెస్టెంట్ సగం గుండుతో పాటు మీసాలు కూడా సగం చేయించుకోవాలి. దానికి నోయల్, అఖిల్, అభిజీత్ సహా ఎవరూ ఒప్పుకోలేదు. కానీ అమ్మ రాజశేఖర్ ముందుకొచ్చాడు. మళ్లీ ఆ తర్వాత డీల్ ఒప్పుకోలేదు. బిగ్ బాస్‌కు డీల్ ఇచ్చి ఒప్పుకోకపోవడంతో మరోసారి నాగ్ అదే డీల్ వీకెండ్‌లో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైనా అలా చేస్తే నెక్ట్స్ వీక్ నామినేషన్స్ లేకుండా చేస్తానంటూ మాటిచ్చాడు. దానికి ఇంటి కెప్టెన్ అయిన నోయల్‌తో పాటు అఖిల్, అభి, కుమార్ సాయి అంతా సైలెంట్‌గా ఉన్నారు. కానీ అమ్మ రాజశేఖర్ మాత్రం ముందుకొచ్చాడు.

తనకు ఎంతో యిష్టమైన జుట్టును సగం కత్తిరించుకోడానికి సిద్ధమయ్యాడు. అది కూడా అరగుండుతో పాటు అర మీసం కూడా. దానికి ఓకే చెప్పడంతో ఇంటి సభ్యులంతా నో చెప్పారు. మాస్టర్ ఇప్పుడు కూడా మించిపోలేదు ఒక్కసారి నో చెప్పండి అంటూ వేడుకున్నారు. కానీ అమ్మ మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. ఆయన సగం గుండు కొట్టించుకున్నాడు.. దాంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా దివి అయితే అమ్మ రాజశేఖర్‌పై సీరియస్ అయింది. ఒక్కమాట నో అని చెప్పలేరా.. మీ నిర్ణయం మీరు తీసుకోలేరా అంటూ మండిపడింది. నాగార్జున కూడా ఈ విషయంలో ఏం మాట్లాడలేదు. ఏదేమైనా కూడా నెక్ట్స్ నామినేషన్స్ సేవ్ అవ్వడం కోసం ఏకంగా అరగుండు కొట్టించుకుని సంచలనం సృష్టించాడు అమ్మ రాజశేఖర్.
Published by:Praveen Kumar Vadla
First published: