Bigg Boss 4 Akhil Abhijeet: అఖిల్, అభిజీత్ కలిసిపోయారు.. అమ్మ రాజశేఖర్‌కు కాలింది..

Bigg Boss 4 Akhil Abijeet: బిగ్ బాస్ 4 తెలుగులో ఎక్కడలేని వింతలన్నీ జరుగుతున్నాయి. ప్రతీవారం నామినేషన్స్ సమయంలో ఇద్దరు కచ్చితంగా నామినేట్ చేసుకునే వాళ్లు. వాళ్లే అభిజీత్, అఖిల్ సార్థక్. గత కొన్ని వారాలుగా ఈ ఇద్దరి మధ్య రచ్చ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 27, 2020, 8:30 AM IST
Bigg Boss 4 Akhil Abhijeet: అఖిల్, అభిజీత్ కలిసిపోయారు.. అమ్మ రాజశేఖర్‌కు కాలింది..
అఖిల్ అభిజీత్ అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ 4 తెలుగు (akhil abijeet amma rajasekhar)
  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో ఎక్కడలేని వింతలన్నీ జరుగుతున్నాయి. ప్రతీవారం నామినేషన్స్ సమయంలో ఇద్దరు కచ్చితంగా నామినేట్ చేసుకునే వాళ్లు. వాళ్లే అభిజీత్, అఖిల్ సార్థక్. గత కొన్ని వారాలుగా ఈ ఇద్దరి మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. నాగార్జున చెప్పిన తర్వాత కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మోనాల్ విషయంలోనే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదటి వారమే వచ్చాయి. అయితే అది ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ బయటికి మాత్రం వేరేలా ఉంది. కేవలం మోనాల్ కోసమే ఈ ఇద్దరూ తిట్టుకుంటున్నారని.. ప్రతీవారం గొడవ పడుతున్నారని బయటికి వస్తుంది. దీనిపైనే అఖిల్, అభి గత వారం కూర్చుని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అఖిల్, అభి కలిసిపోవడంతో బయట వాళ్ల ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరూ కలిసిపోవడంతో ఒకరికి మాత్రం మండిపోయింది. అది మోనాల్ మాత్రం కాదు.. అమ్మ రాజశేఖర్ ఈ విషయంలో ఎందుకో తెలియదు కానీ బాగా హర్ట్ అయ్యాడు.

అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar)
అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar)


ఏకంగా అఖిల్‌ను ఈ వారం నామినేట్ చేయడానికి అదే కారణంగా చూపించాడు. నీ కారణంగానే మోనాల్, అభిజీత్ మాట్లాడుకోవడం లేదు.. కానీ నువ్వు మాత్రం అవేం పట్టించుకోకుండా వెళ్లి అభిజీత్‌తో మాట్లాడుతున్నావ్.. అది నాకు నచ్చలేదంటూ అమ్మ చెప్పాడు. దాంతో అఖిల్ షాక్ అయ్యాడు. మోనాల్, అభి మాట్లాడుకోకపోతే దానికి తానేం చేస్తానంటూ ఫైర్ అయ్యాడు. కారణాలేం లేకపోతే డైరెక్టుగా నామినేట్ చేయండి కానీ ఇలా సిల్లీ రీజన్స్ చెప్పకండి అంటూ మండిపడ్డాడు.

అఖిల్ అభిజీత్ బిగ్ బాస్ 4 తెలుగు (Abijeet Akhil Bigg Boss 4 Telugu)
అఖిల్ అభిజీత్ బిగ్ బాస్ 4 తెలుగు (Abijeet Akhil Bigg Boss 4 Telugu)


మరోవైపు అమ్మ మాత్రం మోనాల్, నువ్వు బాగానే మాట్లాడుకుంటున్నారు.. కానీ మంచి ఫ్రెండ్స్‌గా ఉన్న అభి, మోనాల్ ఇంకా మాట్లాడుకోవడం లేదు.. నువ్వు చెప్పాలి కదా మోనాల్‌ను వెళ్లి అభితో మాట్లాడమని అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో అఖిల్ మరింత రెచ్చిపోయాడు. అసలు మోనాల్ విషయంలో తానెందుకు ముందుకొస్తానని.. తానేం ఇంట్లోకి మోనాల్‌తో కలిసి రాలేదు.. మోనాల్ కోసం ఇక్కడ తాను లేనంటూ క్లారిటీ ఇచ్చాడు. అసలు అభి విషయంలో మీరెందుకు తనను టార్గెట్ చేస్తున్నారు.. మేం మాట్లాడుకుంటే మీకొచ్చిన సమస్యేంటో అర్థం కావడం లేదంటూ ప్రశ్నించాడు అఖిల్.

బిగ్ బాస్ 4 తెలుగు అఖిల్, అభిజీత్ (bigg boss 4 abijeet akhil)
బిగ్ బాస్ 4 తెలుగు అఖిల్, అభిజీత్ (bigg boss 4 abijeet akhil)


ఇద్దరు గొడవపడి సారీ చెప్పిన తర్వాత దాన్ని పరిష్కరించుకోవాలి కానీ అలాగే గొడవలు కంటిన్యూ చేయకూడదు కదా అంటూ అడిగేసాడు అఖిల్. మీకు బలమైన కారణాలుంటే చెప్పండి కానీ ఇలా గలీజ్ కారణాలు చెప్పి నామినేట్ చేయొద్దంటూ ఫైర్ అయ్యాడు అఖిల్. మరోవైపు అభిజీత్, మోనాల్ కూడా తమ పేర్లు అనవసరంగా నామినేషన్స్ అప్పుడు బయటికి తీయొద్దంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా అఖిల్, అభి కలవడం మాత్రం అమ్మకు అస్సలు నచ్చలేదు.
Published by: Praveen Kumar Vadla
First published: October 27, 2020, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading