• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU AMMA RAJASEKHAR ELIMINATED THIS WEEK AND ELIMINATED AS CAPTAIN PK

Bigg Boss 4 Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ ఎలిమినేటెడ్.. ఈ సారి ఎలాంటి డ్రామాల్లేవు..

Bigg Boss 4 Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ ఎలిమినేటెడ్.. ఈ సారి ఎలాంటి డ్రామాల్లేవు..

అమ్మ రాజశేఖర్ (amma rajasekhar)

Bigg Boss 4 Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ గతవారమే ఎలిమినేట్ అయ్యాడు. అయితే నోయల్ పేరు చెప్పి సేవ్ చేసారు. అయితే ఒక్కవారం గడిచిన తర్వాత మరోసారి ఎలిమినేట్ అయ్యాడు అమ్మ. ఈ సారి ఎలాంటి డ్రామాలు లేవు.

  • Share this:
అమ్మ రాజశేఖర్ గతవారమే ఎలిమినేట్ అయ్యాడు. అయితే నోయల్ పేరు చెప్పి సేవ్ చేసారు. అయితే ఒక్కవారం గడిచిన తర్వాత మరోసారి ఎలిమినేట్ అయ్యాడు అమ్మ. ఈ సారి ఎలాంటి డ్రామాలు లేవు. నిజంగానే అమ్మ ఇంటి నుంచి బయటికి వచ్చేసాడు. బిగ్ బాస్ 4 తెలుగు మొదలైన తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అమ్మ రాజశేఖర్ మాత్రం కొన్ని వారాల నుంచి కాస్త వెనకాలే ఉన్నాడు. ఇంట్లో అఖిల్, అభిజీత్, సోహెల్ లాంటి కుర్రాళ్ల మధ్య ఈయన పోటీ తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు నేను ఇది అంటూ చెప్పుకోడానికి ఒక్కటి కూడా చేయలేదు అమ్మ. ఆ మద్య ఒక్కసారి నామినేషన్ నుంచి సేవ్ కావడానికి అరగుండు కొట్టించుకోవడం తప్ప. పైగా దివి వెళ్లిపోయిన తర్వాత అమ్మ రాజశేఖర్ ఆట మరింత దారుణంగా మారిపోయింది. ఈయన కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంట్లో అందరిపై అరిచేస్తున్నాడు.. అభిజీత్, హారికను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు ఈయన. నోయల్ వెళ్తూ వెళ్తూ చేసిన కామెంట్స్ మనసులో పెట్టుకుని రచ్చ రచ్చ చేసాడు అమ్మ రాజశేఖర్.

bigg boss 4 telugu,bigg boss 4 telugu amma rajasekhar elimination,bigg boss 4 telugu amma rajasekhar eliminated as captain,bigg boss 4 telugu amma rajasekhar mehboob eliminated,bigg boss 4 telugu amma rajasekhar eliminated,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్,అమ్మ రాజశేఖర్,బిగ్ బాస్ 4 తెలుగు ఎలిమినేటెడ్ కెప్టెన్ అమ్మ రాజశేఖర్
బిగ్ బాస్ 4 అమ్మ రాజశేఖర్ అవినాష్ (avinash amma rajasekhar)


ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఇంటి కెప్టెన్ అయ్యాడు అమ్మ రాజశేఖర్. అయిన వెంటనే తనను ఎవరైతే టార్గెట్ చేసారో వాళ్లందర్నీ గుర్తు పెట్టుకున్నాడు అమ్మ. అభిజీత్, హారికతో పాటు సోహెల్‌ను కూడా బాగానే టార్గెట్ చేసాడు. ఈ వారం నామినేషన్స్‌లో ముందు నుంచి డేంజర్‌ జోన్‌లో ఉన్నది అమ్మనే. 9వ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి అభిజీత్, హారిక, మోనాల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ నామినేట్ అయ్యారు. అందులో అవినాష్, అభిజీత్, హారిక, మోనాల్ సేవ్ అయ్యారు. దాంతో ఈ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. కెప్టెన్‌గా ఉండి ఇంటి నుంచి బయటికి వెళ్లడం అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి అరుదైన రికార్డు అమ్మ రాజశేఖర్ సొంతం చేసుకున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: