Home /News /movies /

BIGG BOSS 4 TELUGU ALL SET TO ABHIJEETH GOT TOPS IN VOTING RESULTS RUNNER UP MAY BE ARIYANA SOHEL AKHIL HERE ARE THE DETAILS TA

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ ఫైనల్‌లో ఆ కంటెస్టెంట్‌కు ఎక్కువ ఓట్లు.. రన్నరప్‌గా ఎవరంటే.. ?

బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

Bigg Boss 4 Telugu: గత 15 వారాలుగా తెలుగు టెలివిజన్ తెరపై మెజారిటీ ప్రేక్షకులను మెప్పిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సారి ఫైనల్ లిస్టులో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే..

    Bigg Boss 4 Telugu: గత 15 వారాలుగా తెలుగు టెలివిజన్ తెరపై మెజారిటీ ప్రేక్షకులను మెప్పిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. రేపటి (ఆదివారం)తో బిగ్‌బాస్ 4 సీజన్ కూడా కంప్లీట్ కానుంది. గత మూడు సీజన్లులాగా ఈ నాల్గో సీజన్‌లో విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యూత్‌లో చాలా మంది బిగ్‌బాస్ షో గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సారి పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోవడంతో ప్రారంభంలో కొన్ని ఒడిదుడుగులు లోనైంది. మరోవైపు అందరికీ తెలిసిన వాళ్లు ముందుగా ఎలిమినేట్‌ కావడాన్ని బిగ్‌బాస్‌కు మైనస్‌గా మారుతుందని అందరు అనుకున్నా.. అనూహ్యంగా బిగ్‌బాస్ షో పుంజుకుంది. ఫైనల్‌గా చివరి అంకానికి చేరుకుంది. మొత్తంగా అందరికీ ఈ ప్రోగ్రామ్ నచ్చిందో లేదో  ఆ మ్యాటర్ పక్కనబెడితే బిగ్ బాస్ మాత్రం మెజారిటీ ఇళ్లలో భాగం అయిపోయింది.

    ఈ షోలో ఇప్పటి వరకు పోలైన ఓట్లలో అభిజిత్‌కు మెజారిటీ ఓట్లు దక్కాయట. నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌లో హారిక, అరియానా, మరియు సోహైల్‌ల జర్నీ గురించి బిగ్‌బాస్ చర్చించింది. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు ముందుగా అఖిల్ సార్ధిక్ ముందుగా ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అభిజీత్, అరియానా, హరిక, సోహైల్ నిలిచారు.

    బిగ్ బాస్ తెలుగు


    తాజాగా నిన్న పోలైన ఓట్లలో అభిజిత్ 50.33%  శాతం ఓట్లలో నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.  ఆ తర్వాత స్థానంలో  అరియానా 16. 87% శాతం.  సోహౌల్ 15.35% శాతం ఓట్లతో మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. అఖిల్ సార్థిక్ 10.39% శాతం ఓట్లతో నాల్గో ప్లేస్‌లో నిలిస్తే.. హారికా అత్యల్పంగా 7.06% శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచినట్టు సమాచారం. అభికి ఓట్లు భారీగానే పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయినా కూడా అభిజీత్ కాకుండా ఈ సారి అరియానా విన్నర్ అవుతుందని తెలుస్తుంది. అక్కడ ఆమెను విన్నర్‌గా బిగ్ బాస్ నిర్వాహకులు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మూడు సీజన్లకు మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ సారి కాస్త భిన్నంగా ఫీమేల్ కంటెస్టెంట్‌కు బిగ్‌బాస్ కిరీటం దక్కాలని బిగ్‌బాస్ నిర్వాహకులు కోరుకుంటే మాత్రం ఆమెనే బిగ్‌బాస్ 4 తెలుగు విజేతగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేము.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Nagarjuna Akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు