HOME »NEWS »MOVIE »bigg boss 4 telugu akhil pack your bags says nagarjuna and new promo goes viral pk

Bigg Boss 4 Telugu: అఖిల్ ప్యాక్ యువర్ బ్యాగ్స్.. ఇది కూడా సుమ వైల్డ్ కార్డ్ లాంటిదేనా బిగ్ బాస్..?

Bigg Boss 4 Telugu: అఖిల్ ప్యాక్ యువర్ బ్యాగ్స్.. ఇది కూడా సుమ వైల్డ్ కార్డ్ లాంటిదేనా బిగ్ బాస్..?
అఖిల్ ఎలిమినేషన్ (akhil bigg boss nagarjuna)

Bigg Boss 4 Telugu: ఇప్పుడు ఇదే అడుగుతున్నారు అభిమానులు.. ఆడియన్స్. ఎందుకంటే బిగ్ బాస్ మరీ ఎక్కువగా డ్రామాలు ఆడేస్తున్నాడేమో అనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న రచ్చంతా చూస్తుంటే. ప్రోమోలోనే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో..

  • Share this:
ఇప్పుడు ఇదే అడుగుతున్నారు అభిమానులు.. ఆడియన్స్. ఎందుకంటే బిగ్ బాస్ మరీ ఎక్కువగా డ్రామాలు ఆడేస్తున్నాడేమో అనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న రచ్చంతా చూస్తుంటే. ప్రోమోలోనే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పడం అనేది అసాధ్యం. కానీ బిగ్ బాస్ 4 తెలుగులో మరో డ్రామా మొదలైపోయింది. గత వారం రోజులుగా అఖిల్ ఒక్కడే సీక్రేట్ రూమ్‌లో ఉన్నాడు. ఆయన్ని అక్కడే ఉంచి మిగిలిన వాళ్లతో ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. ఇంట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరో నిర్ణయించి బయటికి పంపించండి అంటూ అఖిల్ వెళ్లిపోయాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు సీక్రేట్ రూమ్‌లోనే ఉన్నాడు ఈయన. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ప్రోమో విడుదల చేసారు.. అఖిల్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటూ. దాంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదేంటి ఏకంగా ప్రోమోలోనే అఖిల్‌ను ఎలిమినేట్ చేస్తున్నారా.. ఈ ట్రెండ్ ఎప్పట్నుంచి మొదలైంది.. అసలు అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సీక్రేట్ రూమ్‌లోకి పంపిస్తే అక్కడ్నుంచి నేరుగా ఎలా పంపిస్తారు బయటికి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు నామినేషన్‌లో లేకుండానే బయటికి పంపేస్తున్నారా బిగ్ బాస్.. భలేగుంది ఆట అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అఖిల్ గత వారం రోజులుగా సీక్రేట్ రూమ్‌లో ఉన్నా కూడా కాస్త ఓవరాక్షన్ చేసాడనే పేరు కూడా ఉంది. దాంతో కాస్త ధమ్కీ ఇవ్వాలనే ఇలాంటి ప్రోమోను కట్ చేసారని అర్థమవుతుంది. గత వారం సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందంటూ నానా హడావిడి చేసాడు నాగార్జున. కానీ దాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మలేదు సరికదా సుమ వస్తుందంట అంటూ నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అఖిల్ నువ్వు బ్యాగ్స్ ప్యాక్ చేసుకో అనడం.. వెంటనే సీక్రేట్ రూమ్ నుంచి మనోడు ఏడవడం.. సర్ సర్ అంటూ అడుక్కోవడం కాస్త నమ్మబుద్ధి కావడం లేదు. మరి ఈ డ్రామా ఏంటో తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:November 14, 2020, 19:34 IST

टॉप स्टोरीज