బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో ఆఫర్ రావాలని చాలా మంది వేచి చూస్తుంటారు. వచ్చినపుడు దాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటారు. కానీ కొందరు మాత్రమే వచ్చిన అవకాశాన్ని సైతం వదిలేస్తుంటారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా గంగవ్వ బిగ్ బాస్ 4 తెలుగు నుంచి బయటికి వచ్చేసింది. ఆరోగ్యం బాగోలేక ఈమె సొంతంగా బయటికి వచ్చేసింది. ఎలాంటి నామినేషన్స్ లేకుండా.. ఎలిమినేట్ అయిన రెండో కంటెస్టెంట్‌గా నిలిచింది గంగవ్వ. గత వారం రోజులుగా ఈమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది గంగవ్వ. దాంతో ఆమెను పంపించడానికి బిగ్ బాస్ ఓకే చెప్పేసాడు. దాంతో ఐదు వారాల బిగ్ బాస్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టింది గంగవ్వ. అయితే మూడేళ్ల కింద ఇలాగే ఓ కంటెస్టెంట్ బయటికి వచ్చాడు.
అతడే సంపూర్ణేష్ బాబు.. ఎన్టీఆర్ హోస్టుగా వచ్చిన తొలి సీజన్లో సంపూ కూడా ఉన్నాడు. ఈయన్ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు కూడా. ఎందుకంటే అప్పుడు మనోడి ఫాలోయింగ్ కూడా అలాగే ఉండేది మరి. కానీ ఎవరూ ఊహించని విధంగా హోమ్ సిక్ పెట్టుకున్నాడు సంపూర్ణేష్ బాబు. మూడు వారాలు ముగిసిన తర్వాత తాను ఇక్కడ ఉండలేకపోతున్నా.. ఇంటికి పంపించేయండి అంటూ ఏడ్చేసాడు సంపూ. మనోడి పోరు పడలేక బిగ్ బాస్ సైతం ఓకే చెప్పేసాడు. అప్పుడు పూణేలోని లో ఖండ్వాలాలో జరిగింది షో. ఇప్పుడు హైదరాబాద్‌లోనే జరుగుతుంది. అప్పుడు సంపూ ఏడ్చి బయటికి వస్తే.. ఇప్పుడు గంగవ్వ గౌరవంగా బయటికి వచ్చేసింది. ఏదేమైనా కూడా బిగ్ బాస్‌లో అరుదైన ఎలిమినేషన్‌గా ఈ ఇద్దరూ నిలిచిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Sampoornesh babu, Telugu Cinema, Tollywood