Home /News /movies /

BIGG BOSS 4 TELUGU ABIJEET WON THE TITLE AND CHIRANJEEVI PRESENTED THE TROPHY PK

Bigg Boss 4 Abijeet Winner: అభి‘జీత్’ గయా.. ఇకపై అంతా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్..

అభిజీత్‌ (Abijeet Bigg Boss 4 Telugu)

అభిజీత్‌ (Abijeet Bigg Boss 4 Telugu)

Bigg Boss 4 Abijeet Winner: అనుకున్నదే జరిగింది. ఎలాంటి అద్భుతాలు జరగలేదు.. చివర్లో ఎలాంటి ట్విస్టులు కూడా లేవు. ముందు నుంచి అంతా అనుకుంటున్నట్లుగానే బిగ్ బాస్ 4 విజేతగా అభిజీత్ నిలిచాడు. మొదట్నుంచి కూడా ఈయనే గెలుస్తాడంటూ..

అనుకున్నదే జరిగింది. ఎలాంటి అద్భుతాలు జరగలేదు.. చివర్లో ఎలాంటి ట్విస్టులు కూడా లేవు. ముందు నుంచి అంతా అనుకుంటున్నట్లుగానే బిగ్ బాస్ 4 విజేతగా అభిజీత్ నిలిచాడు. మొదట్నుంచి కూడా ఈయనే గెలుస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. మరి గత నాలుగైదు వారాల నుంచి అయితే అభి తప్ప మరొకర్ని విన్నర్‌గా ప్రకటిస్తే అభిమానులు వచ్చి బిగ్ బాస్‌ను సైతం కొడతారేమో అనేంతగా మనోడి క్రేజ్ పెరిగిపోయింది. అంత పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈయన. బిగ్ బాస్ చరిత్రలో అత్యంత ఎక్కువ సార్లు 5 లక్షల కంటే ఎక్కువగా ఈయన పేరుతో ట్రెండింగ్ అయ్యాడు. అంతగా పాపులర్ అయిన అభిజీత్.. చివర్లో అఖిల్‌ను ఓట్ల పరంగా ఓడించి టైటిల్ గెలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో పరిచయమైన ఈయన.. 8 ఏళ్ళ తర్వాత తన కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. అఖిల్ కూడా చివరి వరకు నిలిచినా.. అభి క్రేజ్ ముందు నిలవలేకపోయాడు. నాగార్జున పది కూడా లెక్క పెట్టకుండా అభిజీత్‌ను విన్నర్‌గా ప్రకటించాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు