Bigg Boss 4 Abijeet: బిగ్ బాంబ్.. అభిజీత్‌ను వంటలన్నగా మార్చేసిన లాస్య..

Bigg Boss 4 Abijeet: అదేంటి.. అభిజీత్ వంటలన్నగా మారిపోవడం ఏంటి..? పైగా లాస్య మార్చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది. తాజాగా 11వ వారం ఇంటి నుంచి లాస్య ఎలిమినేట్ అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2020, 10:44 PM IST
Bigg Boss 4 Abijeet: బిగ్ బాంబ్.. అభిజీత్‌ను వంటలన్నగా మార్చేసిన లాస్య..
లాస్య అభిజీత్ (Lasya Abijeet)
  • Share this:
అదేంటి.. అభిజీత్ వంటలన్నగా మారిపోవడం ఏంటి..? పైగా లాస్య మార్చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది. తాజాగా 11వ వారం ఇంటి నుంచి లాస్య ఎలిమినేట్ అయిపోయింది. చివరి వరకు ఉంటుందేమో అనుకున్నారు కానీ అనుకోని విధంగా ఆమె బయటికి వచ్చేసింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినా కూడా వెళ్లిపోయే వాళ్లకు మాత్రం బిగ్ బాంబ్ అంటూ ఒకటి ఇస్తారు. బయటికి వెళ్తున్న వాళ్లు లోపల హౌజ్‌లో ఉన్న వాళ్లపై పగ తీర్చుకోడానికి ఇదొక్కటే ఊరట. ఎవరిపై కోపం ఉన్నా కూడా బిగ్ బాంబ్ వాళ్ళపై వేస్తే సరిపోతుంది. అది చాలా కఠినంగా ఉంటుంది ఒక్కోసారి. కొన్నిసార్లు మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇప్పుడు కూడా లాస్య ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు బిగ్ బాంబ్ ఒకటి ఇచ్చాడు బిగ్ బాస్. అందులో భాగంగా వారం అంతా వెళ్లిపోయే వాళ్లు వేసిన బాంబ్‌కు తగ్గట్టుగా ఉండాల్సిందే.. మరో ఆప్షన్ కూడా లేదు. ఈ క్రమంలోనే లాస్య బిగ్ బాంబ్ ఈ సారి అభిపై వేసింది.
bigg boss 4 telugu,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu abijeet big bomb,bigg boss 4 telugu lasya big bomb,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు బిగ్ బాాంబ్ అభిజీత్,తెలుగు సినిమా
అభిజీత్ (Abijeet/Instagram)

అదేంటంటే వచ్చే వారం అంతా వంట చేయాలి. ఇంట్లో వంట ఎవరు బాగా చేస్తారంటే అభిజీత్ పేరు వచ్చింది. ఆయనకు వంట బాగా వచ్చినా కూడా ఇరుక్కుపోతానేమో అని భయపడి అలా చెప్పలేదు. అయితే లాస్యకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఈ బిగ్ బాంబ్ అభిపై వేసింది లాస్య. దాంతో మనోడు రాబోయే వారం రోజులు వంట గదికే పరిమితం కాక తప్పదు. అలా వంటలన్నగా మారిపోయాడు అభి. మరోవైపు ఓట్ల ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఇంట్లో అందరికంటే లీడింగ్‌లో ఉన్నాడు అభి. కచ్చితంగా ఈ సారి విన్నర్ అయ్యేలా కనిపిస్తున్నాడు ఈ కుర్రాడు. ఈయనకు పోటీగా కూడా ఎవరూ సమీపంలో లేకపోవడం గమనార్హం.
Published by: Praveen Kumar Vadla
First published: November 22, 2020, 10:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading