Bigg Boss 4 Telugu: అభిజీత్ అనారోగ్యం గురించి బయటపెట్టిన అతడి స్నేహితుడు..

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఎవరికి ఉంది అంటే షో మొదలవ్వక ముందు లాస్య పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ప్రకారం చూస్తుంటే అభిజీత్ దూసుకుపోతున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 18, 2020, 7:13 PM IST
Bigg Boss 4 Telugu: అభిజీత్ అనారోగ్యం గురించి బయటపెట్టిన అతడి స్నేహితుడు..
అభిజీత్ (Abijeet/Twitter)
  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఎవరికి ఉంది అంటే షో మొదలవ్వక ముందు లాస్య పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ప్రకారం చూస్తుంటే అభిజీత్ దూసుకుపోతున్నాడు. మైండ్ గేమ్‌తో మనోడు దున్నేస్తున్నాడు. దాంతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. పెళ్లి గోల అంటూ వెబ్ సిరీస్ చేసాడు అభిజీత్. ఈయనకు బయట అయితే పెద్దగా క్రేజ్ లేదు. కేవలం బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాతే మనోడికి డిమాండ్ పెరిగిపోయింది. దాంతో పాటు బయట కూడా అభిజీత్ కోసం ప్రత్యేకమైన పిఆర్ టీం ఒకటి పని చేస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈయన ఇంట్లో బాగానే ఉన్నా కూడా ఒక్క విషయంలో మాత్రం అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. ఇంట్లో మిగిలిన కుర్రాళ్లు ఫిజికల్ టాస్కుల్లో కుమ్మేస్తున్నారు.

అభిజీత్ (Abijeet/Twitter)
అభిజీత్ (Abijeet/Twitter)


అఖిల్, సోహైల్ లాంటి వాళ్లు అయితే ఎంతకైనా తెగిస్తున్నారు. ఎంత దూరం వెళ్లడానికి అయినానే సిద్ధంగా ఉన్నారు. కానీ అభిజీత్ మాత్రం షో మొదలైన రోజు నుంచి కూడా ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉన్నాడు. ఈయన అస్సలు అటు వైపు కూడా అడుగేయడం లేదు. దానికి ఓ కారణం అయితే ఉంది. ఎందుకంటే అభిజీత్ ఫిజికల్ టాస్కులు చేయకపోవడానికి ప్రధాన కారణం ఆయన భుజానికి గాయం కావడం. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే అంత బాడీ ఉన్నా కూడా ఆయన ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉంటున్నాడు. కేవలం మైండ్ గేమ్ మాత్రమే ఆడుతున్నాడు.

అభిజీత్ (Abijeet/Twitter)
అభిజీత్ (Abijeet/Twitter)


ముఖ్యంగా రోబోల టాస్కులో అయితే అభిజీత్ కుమ్మేసాడు. మిగిలిన వాళ్లు పూర్తిగా బాడీని వాడేస్తున్నా కూడా ఈయన మాత్రం మైండ్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నాడు. కేవలం ఈ హెల్త్ ప్రాబ్లమ్ కారణంగానే అభిజీత్ ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉంటున్నాడు. ఇదే విషయం ఆయన సన్నిహితులు చెప్పారు కూడా. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో అభితో పాటు నటించిన సుధాకర్ ఈ విషయం గురించి వీడియో చేసాడు. చేయి సమస్య ఉంది కాబట్టే అభి అవన్నీ చేయట్లేదు.. త్వరలోనే పూర్తిగా బ్యాక్ అవుతాడు.. కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగొస్తాడని సుధాకర్ చెప్పాడు. మొత్తానికి చూడాలిక.. రాబోయే రోజుల్లో అభిజీత్ ఫిజికల్ టాస్కులు చేస్తాడేమో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 18, 2020, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading