Bigg Boss 4 Abijeet: అభిజీత్‌కు అది బాగా కలిసొస్తుందా.. నాగార్జున అందుకే సాఫ్ట్‌గా ఉన్నాడా..?

Bigg Boss 4 Abijeet: బిగ్ బాస్ 4 తెలుగులో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ ఇమేజ్ ఉన్నది ఎవరికి అంటే అభిజీత్ అంటారు అందరూ. ముఖ్యంగా ఈయన తన మైండ్ గేమ్‌తోనే అభిమానులను సంపాదించుకుంటున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 21, 2020, 6:52 PM IST
Bigg Boss 4 Abijeet: అభిజీత్‌కు అది బాగా కలిసొస్తుందా.. నాగార్జున అందుకే సాఫ్ట్‌గా ఉన్నాడా..?
అభిజీత్ (Abijeet/Twitter)
  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ ఇమేజ్ ఉన్నది ఎవరికి అంటే అభిజీత్ అంటారు అందరూ. ముఖ్యంగా ఈయన తన మైండ్ గేమ్‌తోనే అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో పెద్దగా పర్ఫార్మ్ చేయకేపోయినా కూడా ఈయనకు ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. ముఖ్యంగా మాటలు, చేతలతోనే ఆకట్టుకుంటున్నాడు అభి. హౌజ్‌లో అంత మంది ఉన్నా కూడా ఎవరితోనూ ఈయనకు మిత్రుత్వం లేదు.. అలాగని శత్రుత్వం కూడా లేదు. పరిస్థితులకు తగ్గట్లు పాదరసంలా మారిపోతున్నాడు అభి. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి నీళ్లు వెళ్లిపోయినట్లు.. అభి కూడా అలాగే ఉన్నాడు. అందుకే ఈయన ప్రతీవారం నామినేషన్స్‌లోకి వస్తున్నా కూడా సేవ్ అవుతూనే ఉన్నాడు. ఈ వారం కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు అభిజీత్. కానీ డేంజర్ జోన్‌లో మాత్రం లేడు. కచ్చితంగా ఫస్ట్ సేవ్ అయ్యే వాళ్ల లిస్టులో అభి ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పడుతున్న ఓట్లు కూడా ఈయనకే భారీగా ఉన్నాయి.
bigg boss 4 telugu,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu abijeet winner,bigg boss 4 telugu abijeet amala akkineni,bigg boss 4 telugu abijeet akkineni fans support,bigg boss 4 telugu abijeet movies,bigg boss 4 telugu abijeet voting,bigg boss 4 telugu abijeet votes,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 అభిజీత్,బిగ్ బాస్ 4 నాగార్జున అభిజీత్
అభిజీత్ (Abijeet/Instagram)


దాదాపు 40 శాతం ఓట్లతో దూసుకుపోతున్నాడు అభిజీత్. అయితే ఈయనకు ఇంత ఫాలోయింగ్ రావడానికి.. అన్ని ఓట్లు పడటానికి.. టైటిల్ విన్ అవుతాడని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి ప్రధానంగా నాగార్జున భార్య అమల అంటున్నారు. అదేంటి అనుకోవచ్చు.. అప్పట్లో అమల అక్కినేనితో కలిసి నటించాడు అభిజీత్. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమల కొడుకుగా నటించాడు అభి. అప్పుడే ఆమెతో మంచి పరిచయం ఏర్పడింది. ఇప్పటికీ అభి తనకు కొడుకు లాంటి వాడే అని చెప్తుంది అమల. దాన్నిబట్టి అక్కినేని కోడలికి ఆయనెంత క్లోజ్ అనేది అర్థమవుతుంది.
bigg boss 4 telugu,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu abijeet winner,bigg boss 4 telugu abijeet amala akkineni,bigg boss 4 telugu abijeet akkineni fans support,bigg boss 4 telugu abijeet movies,bigg boss 4 telugu abijeet voting,bigg boss 4 telugu abijeet votes,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 అభిజీత్,బిగ్ బాస్ 4 నాగార్జున అభిజీత్
అమల అక్కినేని అభిజీత్ (abijeet amala akkineni)

ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ చేసేది నాగార్జున. అంటే అక్కినేని అందగాడు అన్నమాట. అమలతో అభికి ఉన్న పరిచయం ఆయన్ని టైటిల్ వైపు పరుగులు పెట్టేలా చేస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అందుకే నాగార్జున కూడా అభిపై సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నాడా అనేది అర్థం కావడం లేదు. ఏదేమైనా కూడా అక్కినేని అభిమానుల సపోర్ట్ కూడా అభి వైపు ఉంటుందని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈయనకు వాళ్ల నుంచి సపోర్ట్ బాగానే దొరుకుతుంది. దాంతో పాటు పిఆర్ టీం కూడా బాగానే ఉందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి అమలతో కలిసి అప్పట్లో నటించడం కూడా ఇప్పుడు అభికి కలిసొచ్చేలా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: November 21, 2020, 6:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading