HOME » NEWS » movies » BIGG BOSS 4 TELUGU ABIJEET CRIED FOR MONAL GAJJAR AND AKHIL SILENTLY OBSERVING PK

Bigg Boss 4 Telugu: మోనాల్ గజ్జర్ కోసం కన్నీరు పెట్టుకున్న అభిజీత్..

Bigg Boss 4 Telugu: మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌజ్‌లో ఏం చేస్తుందో తెలియదు కానీ 12 వారాలు అయితే బాగానే నెట్టుకొచ్చింది.. ఈ మాట అనే వాళ్లు చాలా మంది ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 25, 2020, 8:12 PM IST
Bigg Boss 4 Telugu: మోనాల్ గజ్జర్ కోసం కన్నీరు పెట్టుకున్న అభిజీత్..
మోనాల్‌తో అభిజీత్ Photo : Star Maa
  • Share this:
మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌజ్‌లో ఏం చేస్తుందో తెలియదు కానీ 12 వారాలు అయితే బాగానే నెట్టుకొచ్చింది.. ఈ మాట అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. మరోవైపు కేవలం అక్కడ కొందర్ని వాడుకుని ఈమె ఇన్ని రోజులు ఇంట్లో ఉండగలిగింది అంటూ మరొకందరు చెప్తున్న మాట. మోనాల్ వాడుకున్న ఆ కొందరు అఖిల్, అభిజీత్. ఇప్పటి వరకు ఉన్న 11 వారాల్లో 3 వారాలు అభిజీత్‌కు ఇస్తే.. మిగిలిన 8 వారాలు అఖిల్‌కు రాసిచ్చేసింది మోనాల్ గజ్జర్. అక్కడా ఇక్కడా తన రిలేషన్ కంటిన్యూ చేస్తుంది. ఓ తరుణంలో ఏకంగా అఖిల్‌ను పెళ్లి చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు అభిజీత్ కూడా కొన్ని వారాల పాటు మోనాల్‌ను దూరం పెట్టినా కూడా ఇప్పుడు ఇద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.
bigg boss 4 telugu,bigg boss 4 telugu new promo,bigg boss 4 telugu abijeet,bigg boss 4 telugu monal abijeet,bigg boss 4 telugu akhil monal,bigg boss 4 telugu monal date abijeet,bigg boss 4 telugu abijeet cried for monal,telugu cinema,అఖిల్,మోనాల్ అభిజీత్,బిగ్ బాస్ 4 తెలుగు
అభిజీత్ (Abijeet/Twitter)


అయితే తెలిసో తెలియకో మోనాల్ ఏడుపుకు చాలా సార్లు కారణం అయ్యారు అఖిల్, అభి. దానికి పరిహారంగా ఇప్పుడు బిగ్ బాస్ శిక్ష వేసాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇప్పుడు మోనాల్‌ను డేట్‌కు తీసుకెళ్లాలని కండీషన్ పెట్టాడు. దానికి అఖిల్ హ్యాపీగానే ఉన్నాడు కానీ అభిజీత్ మాత్రం చాలా హర్ట్ అయ్యాడు.

అసలు ఈ మోనాల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నా జీవితంలోకి.. ఆ పేరు వచ్చినపుడల్లా నాకు రాడ్ పడిపోతుంది.. అంటూ ఇంటి సభ్యులతో చెప్పుకుని ఏడ్చేసాడు. తనకు సంబంధం లేదని చెప్తున్నా కూడా కావాలనే తనను మోనాల్‌తో కనెక్ట్ చేస్తున్నారంటూ బాధ పడుతున్నాడు అభి. ఇంటికి వచ్చిన ఇన్ని రోజులలో ఒక్కసారి కూడా అభిని ఏడుస్తూ చూడలేదు. కానీ ఇప్పుడు మోనాల్ విషయంలో ఏడ్చాడు అభి. మొత్తానికి మరి చూడాలిక.. ఈ ఇద్దరిలో ఎవరు ఆమెతో డేట్‌కు వెళ్తారో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 25, 2020, 8:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading