Bigg Boss 4 Telugu Elimination: బిగ్ బాస్ హౌస్ ‌నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ట్విస్ట్ ఉంటుందా?

Bigg Boss 4 Telugu Elimination 6th week: బిగ్ బాస్ హౌస్ నుంచి ఆరో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నరాన్న అంశం ఉత్కంఠరేపుతోంది. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ వేదికలపై నిర్వహించిన సర్వేల్లో పోల్ అయిన ఓట్ల మేరకు వారిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు.

news18-telugu
Updated: October 17, 2020, 5:26 PM IST
Bigg Boss 4 Telugu Elimination: బిగ్ బాస్ హౌస్ ‌నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ట్విస్ట్ ఉంటుందా?
మోనాల్ గజ్జర్, దివి వాద్త్యా (Image:StarMaa)
  • Share this:
అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ వినోద ప్రియులకు టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్మెంట్ పంచుతోంది. కరోనా ప్రభావంతో థియేటర్లలో సినిమాలు విడుదల కాకపోవడంతో బిగ్ బాస్ షో సగటు ప్రేక్షకులను టీవీలకు కట్టపడేస్తోంది. ఆసక్తికరమైన టాస్క్‌లు రియాల్టీ షోను రక్తికట్టిస్తున్నాయి. ఇక నేరుగా విషయానికొస్తే ఆరో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న అంశం బిగ్ బాస్ ప్రేక్షకుల మధ్య ఉత్కంఠను రేపుతోంది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు ఓటింగ్‌కు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం రాత్రితో ముగిసింది. ఆరో వారపు నామినేషన్‌లో 9 మంది కంటెస్టెంట్స్... అభిజిత్, అఖిల్, లాస్య, నోయల్, దివి, హారిక, అరియానా, కుమార్ సాయి, మోనల్‌లు ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారన్న అంశం ఆసక్తిరేపుతోంది.

పలు సోషల్ మీడియా వేదికలపై నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పోల్స్‌తో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని...ఈ వారం ఎలిమినేషన్ కాబోతున్న కంటెస్టెంట్ ఎవరన్న అంశంపై బీబీ4 షో విశ్లేషకులు తమదైన అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.

bigg boss telugu vote results week 6, bigg boss 4 telugu news, bigg boss 4 elimination 6 week, bb4 telugu news, bigg boss telugu elimination, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ 4 సీజన్, బిగ్ బాస్ 6వ వారం ఎలిమినేషన్
అభిజీత్, అఖిల్ (Photo: Star Maa)


మునుపటి వారం తరహాలోనే ఈ వారం నామినేషన్‌లో నిలిచిన అభిజిత్ అత్యధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలుస్తున్నాడు. దీంతో అతని నామినేషన్ ప్రక్రియ నుంచి పూర్తిగా సేఫ్ కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రెస్‌ను త్యాగం చేసిన అభిజిత్‌కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఓటింగ్ పరంగా బాగా కలిసొస్తోంది.

అటు అభిజిత్‌తో హౌస్‌లో కోల్డ్ వార్ కొనసాగిస్తున్న అఖిల్ ఓటింగ్‌లో రెండో స్థానంలో నిలుస్తున్నాడు. అఖిల్ కూడా సేఫ్ కావడం ఖాయంగా తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్‌లో అఖిల్ ఉండే అవకాశం ఏ మాత్రం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మిగిలిన కంటెస్టెంట్స్‌లో లాస్య, హారిక ఇద్దరి మధ్య మూడు, నాలుగు స్థానాల కోసం పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉన్నట్లు సమాచారం. వారిద్దరూ సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

bigg boss telugu vote results week 6, bigg boss 4 telugu news, bigg boss 4 elimination 6 week, bb4 telugu news, bigg boss telugu elimination, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ 4 సీజన్, బిగ్ బాస్ 6వ వారం ఎలిమినేషన్
లాస్య, దివి (Photo: Star Maa)
మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్‌లో దివి, కుమార్ సాయి, అరియానా, నోయల్, మోనల్ మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నోయల్, మోనల్‌తో పోల్చితే...టాస్క్‌లో చురుగ్గా ఉండటం, సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండటం వంటి కారణాలతో దివి, కుమార్ సాయి, అరియానా బెటర్ పొజీషన్‌లో ఉన్నట్లు సమాచారం.

ఆరో వారంలో నోయల్, మోనల్‌‌కు ఎలిమినేషన్ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో మోనల్ ఎలిమినేట్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోనల్, అభిజిత్ మధ్య ఇన్ని వారాలు నడిచిన లవ్ ట్రాక్...ఆరో వారంలో పెద్దగా లేకపోవడంతో మోనల్‌ ఓట్ల పరంగా బాగా వెనుకబడిపోయినట్లు తెలుస్తోంది.

bigg boss telugu vote results week 6, bigg boss 4 telugu news, bigg boss 4 elimination 6 week, bb4 telugu news, bigg boss telugu elimination, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్ 4 సీజన్, బిగ్ బాస్ 6వ వారం ఎలిమినేషన్
మోనల్ గజ్జర్(Photo: Star Maa)


ఈ వారపు ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. ఐదుగురు కంటెస్టెంట్స్ మధ్య ఓట్లు దాదాపు సమానంగా ఉండటంతో ఎలిమినేషన్ ప్రక్రియలో ట్విస్ట్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ట్విస్ట్ వాస్తవమైతే...ఈ వారం ఎవరినీ ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. అలా జరిగితే వచ్చే వారం(7వ వారం) డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Published by: Janardhan V
First published: October 17, 2020, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading