BB4 Telugu: దేత్తడి హారిక ఫేక్ ఎలిమినేషన్..లీక్ వీరులు ముందుగా చెప్పినట్టే..

Bigg Boss 4 Telugu Updates: లీకు వీరులు ముందే చెప్పినట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి యూట్యూబర్ దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్ చేశారు. ఫేక్ ఎలిమినేషన్ ప్రక్రియ రక్తకట్టించగా...చివరకు హౌస్‌లో ఏం జరగబోతుందోనని ఉత్కంఠగా చూసిన ప్రేక్షకుల మాత్రం ఫూల్స్ అయ్యారు.

news18-telugu
Updated: September 20, 2020, 10:51 PM IST
BB4 Telugu: దేత్తడి హారిక ఫేక్ ఎలిమినేషన్..లీక్ వీరులు ముందుగా చెప్పినట్టే..
దేత్తడి హారిక(ఫైల్ ఫోటో)
  • Share this:
లీకు వీరులు ముందే చెప్పినట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి యూట్యూబర్ దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్ చేశారు. ఫేక్ ఎలిమినేషన్ ప్రక్రియ రక్తకట్టించగా...చివరకు హౌస్‌లో ఏం జరగబోతుందోనని ఉత్కంఠగా చూసిన ప్రేక్షకుల మాత్రం ఫూల్స్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేత్తడి హారిక అన్న విషయం అందరికీ తెలిసిందే. హారిక ఎనిమినేషన్‌ను ఎవరూ ఊహించి కూడా చూడలేరు. అయితే హారిక,  మోనల్ గజ్జర్‌లలో ఎవరిని ఎలిమినేట్ చేయాలన్న అంశంపై సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకునేందుకు హౌస్‌లో ఓ టాస్క్ నిర్వహించారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయాల మేరకు హారికను ఎలిమినేట్ చేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించడంతో హౌస్‌లో ఎమోషన్స్ తారస్థాయికి చేరాయి. ఏడుపులు, సెల్ఫీలు అంటూ కథ నడిచింది. అయితే తెలివైన ప్రేక్షకులకు మాత్రం అంతా డ్రామా నడుస్తోందని ముందే తెలిసిపోయింది. తర్వాత నాగార్జున కూడా ఫేక్ ఎలిమినేషన్ అంటూ చల్లగా తీపికబురు చెప్పారు.

ఫేక్ ఎలిమినేషన్‌ టాస్క్‌తో అంత ఎమోషనల్ డ్రామా నడపడం మాత్రం అందరు ప్రేక్షకులకు నచ్చేది కాదు. మొత్తానికి ఈ వారం ఒక ఎలిమినేషన్(కరాటే కల్యాణి)తోనే సరిపెట్టుకున్నారు. మొదటి ఎలిమినేషన్(సూర్య కిరణ్)తో పాటు రెండో ఎలిమినేషన్(కరాటే కల్యాణ్), ఫేక్ ఎలిమినేషన్(దేత్తడి హారిక)ను లీకు వీరులు ముందే చెప్పేశారు. ఆ మేరకు పలు మీడియాల్లో ముందే కథనాలు వచ్చాయి. అంటే హౌస్‌లో జరుగుతున్న అంశాలు లీక్ కాకుండా జాగ్రత్తపడటంలో స్టార్ మా మరోసారి వైఫల్యం చెందిందనే చెప్పాలి.

bigg boss 4 telugu, bigg boss 4 updates, bigg boss 4 latest news, bigg boss 4 Telugu promo,nagarjuna host bigg boss promo,nagarjuna bigg boss 4 telugu promo,bigg boss 4,Nagarjuna bigg boss 4,Nagarjuna remuneration for bigg boss 4,nagarjuna remuneration,Nagarjuna akkineni host bigg boss 4,bigg boss 4 telugu,bigg boss 4 telugu contestnats,bigg boss 4 nagarjuna host,bigg boss 4 mahesh babu host,bigg boss 4 tharun contestant,bigg boss 4 mangli singer,bigg boss 4 ntr,bigg boss 4 in july 2020,bigg boss 4 contestants,బిగ్‌బాస్ 4,బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్,బిగ్‌బాస్ 4 హోస్ట్,బిగ్‌బాస్ 4 తరుణ్ మంగ్లీ,నాగార్జున హోస్ట్ బిగ్‌బాస్ సీజన్ 4,బిగ్‌బాస్ సీజన్ 4 కోసం నాగార్జునకు భారీ పారితోషకం,బిగ్‌బాస్ సీజన్ 4 కోసం నాగార్జున భారీ పారితోషకం,తెలుగులో ప్రారంభమైన బిగ్‌బాస్,బిగ్‌ బాస్ 4 సీజన్ నాగార్జున ప్రోమో,సెప్టెంబర్ 6 నుంచి బిగ్‌బాస్ ప్రోగ్రామ్ స్టార్ట్,సెప్టెంబర్ 6 నుంచి బిగ్‌బాస్ 4 తెలుగు
ఫేక్ ఎలిమినేషన్‌పై మెమ్స్


అటు సోషల్ మీడియా వేదికగానూ ఫేక్ ఎలిమినేషన్ ప్రక్రియ పట్ల నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌ను తట్టుకునేందుకే టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలా చేస్తున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
Published by: Janardhan V
First published: September 20, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading