Home /News /movies /

BIGG BOSS 4 TELUGU 13TH WEEK NOMINATIONS AND MONAL GAJJAR FIRED ON AVINASH FOR INTERRUPTING HER PK

Bigg Boss 4 Telugu 13th week Nominations: మధ్యలో మాట్లాడకు.. అవినాష్‌పై మోనాల్ ఫైర్..

అవినాష్ మోనాల్ గజ్జర్ (Avinash Monal Gajjar)

అవినాష్ మోనాల్ గజ్జర్ (Avinash Monal Gajjar)

Bigg Boss 4 Telugu 13th week Nominations: బిగ్ బాస్ 4 తెలుగులో చూస్తుండగానే 12 వారాలు అయిపోయాయి. 13వ వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది గేమ్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి అవినాష్ బతికిపోయాడు కానీ లేకపోతే ఈ రోజు ఇంట్లో కూర్చుని టీవీ చూసేవాడు.

ఇంకా చదవండి ...
బిగ్ బాస్ 4 తెలుగులో చూస్తుండగానే 12 వారాలు అయిపోయాయి. 13వ వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది గేమ్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి అవినాష్ బతికిపోయాడు కానీ లేకపోతే ఈ రోజు ఇంట్లో కూర్చుని టీవీ చూసేవాడు. 12వ వారం ఎలిమినేషన్ లేకుండానే ముగించేసారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే నామినేషన్ ప్రక్రియలో భాగంగా మరోసారి ఇంటి సభ్యుల మధ్య రచ్చ జరిగింది. అప్పటి వరకు బాగానే ఉన్నా నామినేషన్స్ సమయంలో మాత్రం ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం అక్కడ కామన్ సీన్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా హారిక వెళ్లి అభిజీత్‌ను నామినేట్ చేయడం కొసమెరుపు. మొన్న టాస్కులో పర్ఫార్మెన్స్ చేయనందుకు ఆమె నామినేట్ చేసింది. అయితే తిరిగి అభి కూడా హారికకు సమాధానమిచ్చాడు. ఇదిలా ఉంటే అవినాష్, అఖిల్ మధ్య కూడా చర్చ వేడిగానే జరిగింది. తనకంటే వీక్ అనుకున్న వాళ్లు ఇంట్లో ఉన్నపుడు తానెందుకు ఎలిమినేట్ కావాలంటూ అవినాష్ ప్రశ్న రైజ్ చేసాడు.

దానికి నీది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ గురూ అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అఖిల్‌ను నామినేట్ చేసింది మోనాల్. బుర్ర పెట్టి ఆడు అని అఖిల్ అంటుంటే కాదు హార్ట్‌తో ఆడతానంటూ సమాధానమిచ్చింది మోనాల్. అంటే ఇప్పుడు అందరి ముందు నన్ను బ్యాడ్ చేస్తున్నావా అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. అఖిల్ సీన్ తర్వాత అరియానా వచ్చింది. ఆమె మోనాల్‌ను టార్గెట్ చేసింది. ఇద్దరి మధ్య ఇంగ్లీష్‌లో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో అవినాష్ వచ్చి తెలుగులో మాట్లాడమని సూచించాడు.
Bigg Boss 4 Telugu,Bigg Boss 4 Telugu nominations,Bigg Boss 4 Telugu abijeet harika,Bigg Boss 4 Telugu monal nominated akhil,Bigg Boss 4 Telugu akhil nominated avinash,Bigg Boss 4 Telugu 13th week Nominations,telugu cinema,Bigg Boss 4 Telugu monal fires on avinash,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అవినాష్ ఫైర్,అఖిల్‌ను నామినేట్ చేసిన మోనాల్
మోనాల్ అరియానా (Monal ariyana)

దానికి మోనాల్‌కు ఎక్కడ లేని కోపమొచ్చింది. నేను మధ్యలో మాట్లాడుతున్నపుడు నువ్వెందుకు వచ్చావ్.. మధ్యలో మాట్లాడకు.. ఇక్కడ అందరికీ మాట్లాడే హక్కు ఉంది అంటూ ఫైర్ అయిపోయింది. ఎంతమంది కంట్రోల్ చేసినా కూడా కూల్ కాలేదు మోనాల్. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చగానే పూర్తయ్యాయి. అక్కడ జరిగిన సీన్ చూస్తుంటే సోహైల్ మాత్రమే సేవ్ అయ్యేలా కనిపిస్తున్నాడు ఈ వారం.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Jabardasth avinash, Monal gajjar, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు