Bigg Boss 4 Telegu: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనే.. ఇంతకీ ఎవరంటే..

Bigg Boss 4 Telugu | నాగార్జున రెండో సారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్ 4 ఈ వీకెండ్‌తో 11 వారాలు కంప్లీట్ చేసుకుటుంది. వీకెండ్ రాగానే హౌస్‌లో ఎవరెవరు ఉంటారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. ఈ వారం కంటెస్టెంట్స్‌లతో ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే..

news18-telugu
Updated: November 21, 2020, 8:11 AM IST
Bigg Boss 4 Telegu: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనే.. ఇంతకీ ఎవరంటే..
బిగ్‌బాస్ 4 తెలుగు (Twitter/Photo)
  • Share this:
Bigg Boss 4 Telugu | నాగార్జున రెండో సారి హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్ 4 ఈ వీకెండ్‌తో 11 వారాలు కంప్లీట్ చేసుకుటుంది. వీకెండ్ రాగానే హౌస్‌లో ఎవరెవరు ఉంటారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి నెలకొంది. క్లైమాక్స్‌ దిశగా దూసుకుపోతున్న బిగ్‌బాస్‌లో రాను రాను ఎలిమినేషన్ ట్విస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది.  గత వారం హౌస్ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో హరిక, అరియానా, అభిజిత్, లాస్య, సొహైల్, మోనాల్ నామినేట్ అయిన సంగతి విదితమే. ఐతే.. ఈ వారం అభిజిత్‌కు పోలైన ఓట్లను బట్టి అతను హౌస్‌లో సేఫ్ అయిపోయాడు. ఈ వీక్ కూడా అభిజిత్ ఆడియన్స్   ఓటింగ్‌లో మొదటి ప్లేస్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత హౌస్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను మంచిగానే హ్యాండిల్ చేస్తోన్న సొహైల్ రెండో ప్లేస్‌లో దక్కించుకోవడంతో అతను హౌస్‌లో సేఫ్ అనే విషయం స్పష్టమయింది.

Bigg Boss 4 Telegu This week Eliminated One of the Female Contestant Here Are The Details,చBigg Boss 4 Telugu 11th week Nominations,Lasya Elimination This Week,Bigg Boss 4 Telugu 10th week Nominations ariyana,Bigg Boss 4 Telugu 10th week Nominations abijeet monal,ariyana nominated by all housemates,bigg boss 4 telugu,bigg boss 4 telugu new promo,bigg boss 4 telugu 10th week,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు 10వ వారం నామినేషన్స్,అఖిల్ అభిజీత్,మోనాల్ అరియానా హారిక,సోహెల్ మెహబూబ్ నామినేషన్స్, లాస్య ఎలిమినేషన్ బిగ్‌బాస్ హౌస్
బిగ్‌బాస్‌లో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే.. (StarMaa/Twitter/Photos)


ఇక బిగ్‌బాస్ హౌస్‌లో అరియానా.. ఇంట్లో మాములుగా జెన్యూన్‌గా ఆట ఆడటంతో ఈ వారం ఆమెకు భారీగానే ఓట్లు వచ్చాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో అవినాష్ లేడు కాబట్టి.. అతని ఓట్లు అరియానాకు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో అరియానా కూడా హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. ఇక మోనాల్ విషయానికొస్తే.. ఆమెకు బిగ్‌బాస్ ఆమెపై కాస్త సానుభూతి ఉన్నట్టు ముందు నుంచి కనిపిస్తోంది. దీంతో కూడా ఆమె కూడా హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండా సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి. ఏ విధంగా చూసుకున్న హరిక, లాస్య ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్‌  నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఇక బిగ్‌బాస్‌ టాస్కుల్లో లాస్య కంటే హారిక రెండాకులు ఎక్కువే అన్నట్టు ఉంది. అంతేకాదు ఎప్పటి కప్పుడు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులను పూర్తి చేయడంలో హారిక ముందుండటంతో ఆమె కూడా ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు తన ఫ్యాన్స్ వేసే ఓట్లతో హౌస్‌లో సేవ్ అవుతూ వస్తోన్న లాస్య ఈ సారి తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. ఇదే నిజమైతే.. రాయలసీమ బిడ్డ లాస్య హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 21, 2020, 8:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading