Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4లో కీలక మార్పు.. ప్రేక్షకులు ఒప్పుకుంటారా..

తెలుగులో ఇప్పటి వరకు ప్రసారమైన మూడు సీజన్లు సూపర్ హిట్టైయ్యాయి. త్వరలో ప్రసారం కానున్న సీజన్ 4లో కొన్ని కీలక మార్పులు చేయనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: July 21, 2020, 11:08 AM IST
Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4లో కీలక మార్పు.. ప్రేక్షకులు ఒప్పుకుంటారా..
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
  • Share this:
తెలుగులో ఇప్పటి వరకు ప్రసారమైన మూడు సీజన్లు సూపర్ హిట్టైయ్యాయి. అందులో ఎన్టీఆర్‌ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్‌కే ప్రేక్షకులు ఎక్కువ మార్కులు వేసారు. ఆ తర్వాత నాని, నాగార్జున కూడా తనదైన శైలిలో ఈ ప్రోగ్రామ్‌ను రక్తి కట్టించారు. నాల్గో సీజన్‌ కోసం ఇప్పటికే రంగం సిద్ధం అయింది. కానీ కరోనా కారణంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ.. తాజాగా నాల్గో సీజన్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసారు స్టార్ మా నిర్వాహకులు. నాల్గో సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్‌గా ఈ కార్యక్రమాన్ని రన్ చేయనున్నారు. తెలుగులో వరసు రెండు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కాడు. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం కొంత మంది సెలబ్రిటీలను లిస్ట్ ఔట్ చేసింది. అంతేకాదు స్మాల్ స్క్రీన్ ‌లో ఫేమసైన యాంకర్స్‌తో వెండితెరపై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు ఈ సీజన్‌లో హౌస్‌లో ఉండనున్నారు.

బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)


ఇప్పటి వరకు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ 100 రోజలు వరకు ఒకే ఇంట్లో ఉండేవారు. కానీ మారిన పరిస్థితుల రీత్యా బిగ్‌బాస్‌ సీజన్ 4లో మాత్రం 60 నుంచి 70 రోజులు మాత్రమే బిగ్‌బాస్ సీజన్ 4 రన్ అయ్యేలా ప్లాన్ చేసారట. ఎపిసోడ్స్ తక్కువైనా.. మసాలా కాన్సెస్ట్‌తో రంజు కలిగించే గేమ్స్‌తో ఈ సారి షోను మరింత ఎంటర్టైనింగ్  ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 21, 2020, 11:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading