Bigg Boss 4 Akhil: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్ ఇటీవల ముగిసింది. అందరూ ఊహించినట్లుగానే అభిజీత్ ఈ సీజన్ విజేతగా నిలవగా.. అఖిల్ రన్నర్‌గా మిగిలారు. అయితే మొదటి నుంచి ఈ ఇద్దరి మధ్య టఫ్ కాంపిటేషన్ నడుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో మోనాల్ విషయం నుంచే ఈ ఇద్దరి మధ్య కాంపిటేషన్ స్టార్ట్ అయ్యింది. అయితే ఆ తరువాత అభి, మోనాల్‌కి దూరంగా వెళ్లడంతో వీరిద్దరు దగ్గరయ్యారు. ఇక అఖిల్ సీక్రెట్ రూమ్‌కి వెళ్లి వచ్చినప్పటి నుంచి వీరిద్దరి మధ్య కాంపిటేషన్ మొదలైంది. కాగా ఈ ఇద్దరిని పక్కనపెడితే అఖిల్‌కి హౌజ్‌లో క్లోజ్‌గా ఉన్న వారిలో సొహైల్, మెహబూబ్, మోనాల్‌లు ఉండేవారు. అలాగే గంగవ్వ కూడా హౌజ్‌లో ఉన్న సమయంలో అఖిల్‌కే తన మద్దతును ఇచ్చేది.
కాగా బయటకు వచ్చిన తరువాత అఖిల్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న అఖిల్.. బిగ్‌బాస్‌లో భాగం అయినందుకు చాలా గర్వంగా ఉంది. నాకు మద్దతిచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు నన్ను చూసేందుకు చాలా మంది అభిమానులు వస్తున్నారు. అది నాకు నిజంగా గొప్ప విషయం. ఈ ప్రేమను నేను ఎప్పటికీ మరిచిపోలేను అని చెప్పుకొచ్చారు.
ఇక హౌజ్‌లోకి వెళ్లిన మొదటివారమే ఎలిమినేట్ అవుతానని అనుకున్ననని., ఎందుకంటే హౌజ్‌మేట్స్ నుంచి తనకు సరైన సపోర్ట్ లేదని అఖిల్ చెప్పుకొచ్చారు. నాకు ఇష్టమైన స్నేహితులు అనుకున్న వారే నన్ను సపోర్ట్ చేయలేదు. పైగా నాకు నమ్మకద్రోహం చేశారు. అది నాకు చాలా బాధ అనిపించింది. దాని నుంచి నేను బయటకు రాలేకపోయా. కానీ నాకు మోనాల్ చాలా సార్లు సపోర్ట్ చేసింది. తను నిజంగా స్వీట్ హార్ట్ అంటూ అఖిల్ తెలిపారు.
ఇక తనకు, మోనాల్‌కి మధ్య ఎలాంటి స్పెషల్ ఫీలింగ్స్ లేవని.. తామిద్దరం మంచి స్నేహితులమని, ఈ బంధాన్ని ఇలానే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక ట్రోఫీ గెలవకపోవడం నన్ను బాధించింది. ఎందుకంటే నేను ప్రతి టాస్క్‌లో 100 పర్సెంట్ ఇచ్చా. బిగ్‌బాస్ విన్నర్ అవ్వాలన్నది నా డ్రీమ్. అది అవ్వలేదు అని అఖిల్ వివరించారు.
అయితే రీయూనియన్ ఎపిసోడ్‌లో భాగంగా హౌజ్‌లోకి వెళ్లిన మెహబూబ్.. సొహైల్‌కి డబ్బులు తీసుకొని రా అని హింట్ ఇచ్చినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే సొహైల్ డబ్బులు తీసుకున్నాడన్న టాక్ కూడా నడుస్తోంది. ఇలాంటి సమయంలో అఖిల్.. అన్న మాటలు మెహబూబ్, సొహైల్‌ని ఉద్దేశించి అన్నవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అఖిల్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.