Bigg Boss 4: బిగ్‌బాస్ 4 సీజన్‌లో పూనమ్ కౌర్.. క్లారిటీ ఇచ్చిన భామ..

తెలుగులో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు సంబంధించి కీలకమైన అడుగు ముందుకు పడింది. తాజాగా ఈ షోలో పార్టిసిపేట్ చేసే విషయమై పూనమ్ కౌర్ స్పందించారు.

news18-telugu
Updated: August 2, 2020, 1:44 PM IST
Bigg Boss 4: బిగ్‌బాస్ 4 సీజన్‌లో పూనమ్ కౌర్..  క్లారిటీ ఇచ్చిన భామ..
పూనమ్ కౌర్ Photo : Twitter
  • Share this:
తెలుగులో బిగ్‌బాస్ నాల్గో సీజన్‌కు సంబంధించి కీలకమైన అడుగు ముందుకు పడింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌ను తనదైన చతురతతో ఆకట్టుకున్న నాగార్జున .. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 4ను హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఆయనపై అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను షూట్ చేసారు. ఇప్పటికే కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ షోను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నాగార్జునకు ప్రత్యేకంగా ఓ డాక్టర్‌ను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక బిగ్ బాస్ 4 ఆఫర్ వస్తే కాదనుకున్న వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక్కో ఎపిసోడ్‌కు లక్షలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశాన్ని కాదన్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
బిగ్ బాస్ 4 


ఇప్పటికే ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్‌‌తో పాటు శ్రద్ధా దాస్ ఈ షోలో పార్టిసిపేట్ చేయడం లేదని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వీళ్లతో పాటు యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ రవి, సునయన, రష్మీ గౌతమ్ వంటి వాళ్లకు కూడా బిగ్‌బాస్ 4 సీజన్‌లో ఆఫర్ వచ్చినా.. నో చెప్పినట్టు సమాచారం. తాజాగా బిగ్‌బాస్ 4 షోలో పాల్గొనే దానిపై నటి పూనమ్ కౌర్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ షో నిర్వాహకులు హీరోయిన్ పూనమ్ కౌర్ సంప్రదించిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. ముఖ్యంగా ఈమె ట్విట్టర్‌లో చేసే ట్వీట్టు పెద్ద చర్చకు దారి తీస్తుంటాయి. అందుకే పూనమ్ అయితే.. ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమెను సంప్రదించారు. అంతేకాదు ఆమెకు భారీ పారితోషకం ఆఫర్ చేసారట. కానీ పూనమ్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మొత్తంగా ఇపుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి చాల ా మంది సెలబ్రిటీలు వెనక ముందు ఆలోచిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 2, 2020, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading