Avinash Ariyana: మిగిలిన బిగ్‌బాస్ సీజన్లతో పోలిస్తే ఈ బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి కాస్త క్రేజ్ ఎక్కువనే వచ్చింది చెప్పొచ్చు. ఈ సీజన్‌లో ఎక్కువగా యూట్యూబర్లు, చిన్న నటీనటులు పాల్గొనప్పటికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్‌గా గెలిచిన అభిజీత్‌కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మూడో స్థానంలో నిలిచిన సొహైల్ ఇప్పటికే హీరోగా తన మొదటి సినిమాను కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. అలాగే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే రోజున దివికి ఆఫర్ ఇచ్చారు చిరంజీవి. ఇక మోనాల్ స్టార్ మాలో ఇవాళ్టి నుంచి ప్రసారం కాబోతోన్న డ్యాన్స్ ప్లస్ షోలో ఆమె బాగం కాబోతోంది. ఇలా ఈ సీజన్‌లో పాల్గొన్న ఒక్కొక్కరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్‌లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి అరియానాతో మంచి రిలేషన్ కొనసాగిస్తూ వచ్చాడు అవినాష్. ఒకానొక సమయంలో వీరిద్దరి రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక అరియానాపై తన ఇంట్రస్ట్‌ని కూడా పలుమార్లు చూపుతూ వచ్చాడు అవినాష్. ఒక ఎపిసోడ్‌లో అవినాష్‌ని బయటకు పంపేందుకు సిద్ధం చేయగా., అప్పుడు అరియానా ఎంత భావోద్వేగానికి గురైందో అందరూ చూశారు. ఇలా ఈ సీజన్‌లో గుడ్ పెయిర్‌గా గుర్తింపు పొందిన ఈ జంటతో ఇప్పుడు కొన్ని ఛానెల్స్ ప్రత్యేక ప్రోగ్రామ్‌లను ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా హోస్ట్‌గా అరియానాకు మంచి అనుభవం ఉంది. అలాగే అవినాష్ కూడా శ్రీముఖితో కలిసి ఓ షోను హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరితో కలిసి పలు ఛానెళ్ల వాళ్లు షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.