బిగ్‌బాస్ 4లో పాల్గొని.. గతంలో కంటే ఎక్కువ క్రేజ్‌ని సంపాదించుకోంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. హౌజ్‌లో మోనాల్, అఖిల్ మధ్య రిలేషన్ నడవగా.. వారిద్దరి ఎపిసోడ్లు వీక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక గ్రాండ్ ఫినాలే ముందు వారం వరకు హౌజ్‌లో కొనసాగిన ఈ హీరోయిన్‌కి బయటకు వచ్చిన తరువాత అవకాశాలు బాగా వస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సినిమాలతో పాటు పలు షోలలో ఆమె పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా స్టార్ మాలో రేపటి నుంచి ప్రసారం కాబోయే డ్యాన్స్ ప్లస్ షోలో మోనాల్ పాల్గొనబోతున్నట్లు ఈ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. అందులో వన్ డే టు గో అంటూ తనదైన స్టైల్లో చెప్పింది మోనాల్. అయితే ఈ షోలో మోనాల్ మెంటర్‌గా ఉండనున్నారా..? లేక జడ్జిగా ఉండబోతున్నారా..? అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
అయితే భారీ అంచనాల మధ్య డ్యాన్స్ ప్లస్ షో ప్రారంభం కానుంది. రియాలిటీ షోలో చేయడంలో కింగ్‌గా పేరొందిన ఓంకార్ ఈ డ్యాన్స్ ప్లస్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. బాబా భాస్కర్ మాస్టర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ తదితరులు ఈ షోకు జడ్జిలుగా ఉండబోతున్నట్లు టాక్. ఇక ఈ షోకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిని చూస్తుంటే ఈ షో ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ షోలో దేశ వ్యాప్తంగా పలువురు డ్యాన్సర్లు పాల్గొనబోతున్నారు. భారీ అంచనాల మధ్యన ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది.
రెండు ప్రాజెక్టులను ఓకే చేసినట్లు ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మోనల్. అటు తన బిగ్ బాస్ హౌస్ లవర్ బాయ్ అఖిల్‌తో కలిసి సినిమాలో నటించేందుకు సిద్ధమంటూ ఈ గుజరాతీ భామ టాలీవుడ్ నిర్మాతలను ఊరిస్తోంది. బిగ్ బాస్‌లో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగా పండినందున...సినిమా తీస్తే బాగుంటుందన్న యోచనలో కొందరు నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెత్తానికి టాలీవుడ్లో భారీ అంచనాలతోనే కొత్త సంవత్సరం 2021ని మొదలుపెట్టనుంది మోనల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Monal gajjar, Television News