Home /News /movies /

BIGG BOSS 4 MONAL GAJJAR REVEALS THE REASON BEHIND HER CRYING ON ALLUDU ADHURS SETS MNJ

Monal Gajjar: 'అల్లుడు అదుర్స్' సెట్స్‌లో నేను ఏడవటానికి కారణమిదే.. మోనాల్ గజ్జర్ వివరణ

Monal Gajjar terrific dance moments for nakkilisu golusu song

Monal Gajjar terrific dance moments for nakkilisu golusu song

బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ అల్లుడు అదుర్స్(Alludu Adhurs). న‌భా న‌టేష్(Nabha Natesh), అను ఇమ్మాన్యుల్(Anu Emmanuel) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. ప్ర‌కాష్ రాజ్, సోనూసూద్, బ్ర‌హ్మాజీ, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీలక పాత్ర‌ల్లో నటించారు. అలాగే బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్ గ‌జ్జ‌ర్(Monal Gajjar) స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది

ఇంకా చదవండి ...
    Monal Gajjar: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ అల్లుడు అదుర్స్. న‌భా న‌టేష్, అను ఇమ్మాన్యుల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. ప్ర‌కాష్ రాజ్, సోనూసూద్, బ్ర‌హ్మాజీ, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీలక పాత్ర‌ల్లో నటించారు. అలాగే బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్ గ‌జ్జ‌ర్ స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది. కాగా ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో మోనాల్ గజ్జ‌ర్ ఏడ్చేశార‌ట‌. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు క్రై బేబిగా గుర్తింపు తెచ్చుకున్న మోనాల్.. అల్లుడు అదుర్స్ సెట్స్‌లోనూ ఏడిచిన‌ట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇక దీనిపై ఆదివారం జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్‌లో ఎందుకు ఏడ్చావంటూ మోనాల్‌ని ప్ర‌శ్నించారు సుమ క‌న‌కాల‌.

    అప్పుడు అస‌లు కార‌ణాన్ని చెప్పుకొచ్చింది మోనాల్. డిసెంబ‌ర్ 30న నేను షూటింగ్‌లో పాల్గొన్నా. కానీ ఆ రోజు మా నాన్న చ‌నిపోయిన రోజు. అది గుర్తు వ‌చ్చి ఒక్కసారిగా క‌న్నీళ్లు వ‌చ్చాయి అని మోనాల్ పేర్కొన్నారు. కాగా ఈ ఫంక్ష‌న్‌లో అంద‌రూ మోనాల్‌పై ప్రశంస‌లు కురిపించారు.

    బెల్లంకొండ మాట్లాడుతూ.. మోనాల్ చాలా క‌ష్ట‌ప‌డ్డారని అన్నారు. ఇక ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ కోసం ఏడు రోజులు మోనాల్ క‌ష్ట‌ప‌డింద‌ని ప్ర‌శంసించారు. మూడు రోజులు రిహార్స‌ల్స్ చేసి, నాలుగు రోజులు షూటింగ్‌లో పాల్గొంద‌ని తెలిపారు.

    ఇదిలా ఉంటే అల్లుడు అదుర్స్ ఆడియో ఫంక్ష‌న్‌లో మోన‌ల్ మాట్లాడుతూ.. త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన వారికి థ్యాంక్స్ అని చెప్పారు. డీఎస్పీ సంగీతంలో డ్యాన్స్ చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌ని, ఇప్పుడు త‌న‌కు అవ‌కాశం వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ అవ‌కాశం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాన‌ని మోనాల్ పేర్కొన్నారు.
    Published by:Manjula S
    First published:

    Tags: Alludu Adhurs, Monal gajjar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు