Bigg Boss 4: బిగ్‌బాస్ 4 కోసం నాగార్జున దిమ్మదిరిగే కండీషన్స్..

కరోనా కారణంగా ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ ప్రేమికులు అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది. ఈ సీజన్‌ కోసం నాగార్జున..

news18-telugu
Updated: July 22, 2020, 3:54 PM IST
Bigg Boss 4: బిగ్‌బాస్ 4 కోసం నాగార్జున దిమ్మదిరిగే కండీషన్స్..
బిగ్ బాస్ 4 Photo : Star maa
  • Share this:
కరోనా కారణంగా ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ ప్రేమికులు అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది. నాల్గో సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే స్టార్ మా నిర్వాహకులు కొంత మంది సెలబ్రిటీలను లిస్ట్ ఔట్ చేసింది. కానీ వారెవరనేది మాత్రం రివీల్ చేయలేదు.  స్మాల్ స్క్రీన్ ‌లో ఫేమసైన యాంకర్స్‌తో బిగ్ స్క్రీన్ పై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు ఈ సీజన్‌లో హౌస్‌లో ఉండబోతున్నారు. కరోనా నేపథ్యంలో షూటింగ్ విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకులకు నాగార్జున పలు కండిషన్స్ పెట్టినట్టు సమాచారం. షూటింగ్ చేసే ప్రదేశంలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు కంటెస్టెంట్స్‌తో పాటు డైరెక్ట్ ఇంటారాక్షన్ వద్దని చెప్పాడట. నాగార్జున కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఇంటి నుంచి సరాసరి ఆ స్పెషల్ రూమ్‌కు వచ్చి షూటింగ్ చేసి వెళతారట. అంతేకాదు వారంలో ఒకరోజు మాత్రమే నాగార్జున షోలో పార్టిసిపేట్ చేస్తారట. మిగతా రోజుల్లో కూడా కొంత మంది సెలబ్రిటీలు  ఈ షోలో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

Bigg Boss 4 Host Nagarjuna akkineni apply different variety conditions for season 4 bigg boss,bigg boss 4,Nagarjuna bigg boss 4,Nagarjuna akkineni host bigg boss 4,bigg boss 4 telugu,bigg boss 4 telugu contestnats,bigg boss 4 nagarjuna host,bigg boss 4 mahesh babu host,bigg boss 4 tharun contestant,bigg boss 4 mangli singer,bigg boss 4 ntr,bigg boss 4 in july 2020,bigg boss 4 contestants,బిగ్‌బాస్ 4,బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్,బిగ్‌బాస్ 4 హోస్ట్,బిగ్‌బాస్ 4 తరుణ్ మంగ్లీ,నాగార్జున హోస్ట్ బిగ్‌బాస్ సీజన్ 4
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)


బిగ్‌బాస్ 4ను ఆగష్టు చివరి వారం నుంచి టెలికాస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు వచ్చే వారం నుంచి నాగార్జునకు సంబంధించిన ప్రోమోలను కూడా విడుదల చేయనున్నారు. అంతేకాదు ఎపుడు 100 రోజులకు పైగా కొనసాగే బిగ్‌బాస్ సీజన్ ఈ సారి మాత్రం కేవలం 60 రోజుల నుంచి 70 రోజుల మాత్రమే నిర్వహించేలా ప్లాన్ చేసారట. మొత్తానికి కొత్త కండిషన్స్‌తో సరికొత్తగా రాబోతున్న బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు రంజింప చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ 100 రోజలు వరకు ఒకే ఇంట్లో ఉండేవారు. కానీ మారిన పరిస్థితుల రీత్యా బిగ్‌బాస్‌ సీజన్ 4లో మాత్రం 60 నుంచి 70 రోజులు మాత్రమే బిగ్‌బాస్ సీజన్ 4 రన్ అయ్యేలా ప్లాన్ చేసారట. ఎపిసోడ్స్ తక్కువైనా.. మసాలా కాన్సెస్ట్‌తో రంజు కలిగించే గేమ్స్‌తో ఈ సారి షోను మరింత ఎంటర్టైనింగ్  ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 22, 2020, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading