Shweta Tiwari: బిగ్ బాస్ విన్నర్‌కు కరోనా పాజిటివ్.. షాక్‌లో ఫ్యాన్స్..

Shweta Tiwari: కరోనా ఈ రోజుల్లో ఎవర్నీ వదలడం లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా లిస్టులో చేరిపోవాల్సిందే. ఇప్పటికే ఎన్నో లక్షల మంది మన దేశంలో కరోనా బారిన పడ్డారు. అందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లు కూడా కరోనా వైరస్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 23, 2020, 6:44 PM IST
Shweta Tiwari: బిగ్ బాస్ విన్నర్‌కు కరోనా పాజిటివ్.. షాక్‌లో ఫ్యాన్స్..
శ్వేతా తివారికి కరోనా (shweta tiwari/instagram)
  • Share this:
కరోనా ఈ రోజుల్లో ఎవర్నీ వదలడం లేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా లిస్టులో చేరిపోవాల్సిందే. ఇప్పటికే ఎన్నో లక్షల మంది మన దేశంలో కరోనా బారిన పడ్డారు. అందులో సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లు కూడా కరోనా వైరస్ బారిన బాగానే పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి మరో నటి కూడా చేరిపోయింది. బాలీవుడ్ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ సీజన్ 4 హిందీ విజేత శ్వేతా తివారీ క‌రోనా బారిన పడింది. ముందు ఈ వార్తలపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో అభిమానుల్లో కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వార్తలపై శ్వేతా తివారి క్లారిటీ ఇచ్చింది. తనకు కరోనా వచ్చినట్లు కన్ఫర్మ్ చేసింది.
శ్వేతా తివారికి కరోనా (shweta tiwari/instagram)
శ్వేతా తివారికి కరోనా (shweta tiwari/instagram)


దీని గురించి ఆమె మాట్లాడుతూ సెప్టెంబ‌ర్ 16 నుంచి కాస్త దగ్గు ప్రారంభమైందని చెప్పింది. రిస్క్ తీసుకోవడం ఎందుకని ప‌రీక్ష చేయించుకుంటే ఆ త‌ర్వాతి రోజే పాజిటివ్ అని తేలినట్లు చెప్పుకొచ్చింది తివారి. దాంతో తన ఇంట్లోనే ఓ రూమ్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయినట్లు చెప్పింది ఈమె. తన కూతురు పాల‌క్ కూడా భౌతిక దూరాన్ని స్ట్రిక్ట్‌గా పాటిస్తుందని చెప్పింది. అలాగే కొడుకు రేయాన్ష్‌ తన తండ్రి అభిన‌వ్ శుక్లా దగ్గర ఉన్నట్లు చెప్పింది శ్వేతా. ఈమె వయసు 39 సంవత్సరాలు. ఇదిలా ఉంటే కరోనా బారిన పడ్డందుకు తానేం భయపడటం లేదని చెప్పింది ఈమె.
శ్వేతా తివారికి కరోనా (shweta tiwari/instagram)
శ్వేతా తివారికి కరోనా (shweta tiwari/instagram)

క‌రోనాతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్ర‌తిరోజూ వేడినీళ్లను గుట‌గుటా తాగేస్తున్నట్లు తెలిపింది. తన క్వారంటైన్ అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు ఉందని.. దానికంటే నాలుగు రోజుల ముందే అంటే సెప్టెంబ‌ర్ 27న మరోసారి టెస్ట్ చేయించుకుంటానని చెప్పింది. ఇది తనకు చాలా కష్ట సమయం అంటుంది తివారి. తనకే కాదు అక్క‌డ షూటింగ్స్‌కు కూడా ఇబ్బందే అని గుర్తు చేసుకుంది. ఈ వైరస్ నుంచి ఎప్పుడు ఫ్రీ అవుతామో అంటుంది శ్వేతా తివారీ. ఈమె హిందీలో చాలా సీరియల్స్ చేసింది. దానికంటే ముందు బిగ్ బాస్ సీజన్ 4తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
శ్వేతా తివారికి కరోనా (shweta tiwari/instagram)
శ్వేతా తివారికి కరోనా (shweta tiwari/instagram)

ఆ సీజన్ విన్నర్ కూడా ఈమెనే. సల్మాన్ ఖాన్ హోస్టుగా వచ్చిన ఈ షోకు మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. క‌సౌటీ జింద‌గీ కే సీరియ‌ల్ శ్వేతా తివారీకి మంచి పేరు తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం మేరే డాడ్ కీ దుల్హాన్‌లో నటిస్తుంది శ్వేతా. ప్రస్తుతం కరోనా రావడంతో కొన్ని రోజులు ఆమె లేని ఎపిసోడ్స్ చూడాల్సి వస్తుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: September 23, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading