Bigg Boss 4 Grand Finale: ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొదలైన బిగ్‌బాస్ సీజన్ 4 ఈ డిసెంబర్ 20న ముగిసిన విషయం తెలిసిందే. అందరి అంచనాలను నిజం చేస్తూ అభిజీత్.. ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఇక అభికి మొదటి నుంచి పోటీ ఇస్తూ వస్తోన్న అఖిల్.. రన్నర్‌గా మిగిలాడు. కాగా కరోనా నేపథ్యంలోనూ ఈ గ్రాండ్ ఫినాలేను నిర్వాహకులు అద్భుతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రాండ్ ఫినాలే రోజు దర్శకుడు అనిల్ రావిపూడి, మెహ్రీన్ హౌజ్‌లో సందడి చేయగా.. మెహ్రీన్, ప్రణీత, రాయ్ లక్ష్మి, సంగీత దర్శకుడు థమన్లు స్టేజ్ మీద తమ తమ పర్ఫామెన్స్‌లతో రచ్చ చేశారు. అలాగే బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ల హడావిడి.. చివరగా మెగాస్టార్ చిరంజీవి రావడం.. అందరితో ముచ్చడిండం.. ఇలా ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. కాగా ఈ గ్రాండ్ ఫినాలే ఇప్పుడు రికార్డు క్రియేట్ చేసింది.ఈ ఎపిసోడ్‌కి 21.7 టీవీఆర్ పాయింట్స్ వచ్చాయి. మొత్తం బిగ్‌బాస్ ఈవెంట్లో ఇదే హయ్యెస్ట్ కావడం విశేషం. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో అధికారికంగా ధ్రువీకరించిన నాగార్జున.. వావ్ అంటూ తన సంతోషాన్ని తెలిపారు.
కాగా మొదట 16 మందితో బిగ్‌బాస్ సీజన్ 4 ప్రారంభమైంది. అభిజీత్, అఖిల్, హారిక, అరియానా, సొహైల్, దేవి నాగవల్లి, జోర్దార్ సుజాత, గంగవ్వ, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, మెహబూబ్, లాస్య, దివి , నోయల్, మోనాల్‌లు మొదట హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత స్వాతి దీక్షిత్, అవినాష్, కుమార్ సాయి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వెళ్లారు. వీరిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ రాగా.. గంగవ్వ, నోయెల్ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చారు.
WOWWWW!! Thank you for your love❤️ #BBTeluguGrandFinale
We couldn’t have done it without you 🙏to the audience, to the contestants @EndemolShineIND @StarMaa @KChiruTweets pic.twitter.com/Sbsu8TbdJB
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 31, 2020
నాగార్జన వ్యాఖ్యతగా ఈ సీజన్ ప్రారంభమైంది. అయితే మధ్యలో నాగార్జున షూటింగ్లో బిజీగా ఉండటంతో.. దసరా స్పెషల్ ఎపిసోడ్‌కి సమంత హోస్ట్‌గా చేశారు. ఆమెతో పలువురు ఆ రోజు స్టేజ్ మీద భాగం అయ్యారు. ఇక షో ప్రారంభమైనప్పటి నుంచి పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ రేటింగ్‌లు రాగా.. గ్రాండ్ ఫినాలేకు మాత్రం హయ్యెస్ట్ రేటింగ్ రావడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.