• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 FAME SOHEL DEBUT MOVIE REGULAR SHOOTING STARTED AND FIRST LOOK RELEASED PK

Bigg Boss Sohel: బిగ్ బాస్ సోహెల్ మామూలోడు కాడు.. చెప్పింది చేసి చూపించాడు..

Bigg Boss Sohel: బిగ్ బాస్ సోహెల్ మామూలోడు కాడు.. చెప్పింది చేసి చూపించాడు..

బిగ్ బాస్ సోహెల్ (Bigg Boss sohel)

Bigg Boss Sohel: బిగ్ బాస్ 4 తెలుగు ఫాలో అయిన వాళ్లకు సోహెల్ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దానికి ముందే కొన్ని సీరియల్స్, సినిమాలు చేసినా కూడా ఈయనకు సరైన గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగు ఫాలో అయిన వాళ్లకు సోహెల్ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దానికి ముందే కొన్ని సీరియల్స్, సినిమాలు చేసినా కూడా ఈయనకు సరైన గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అందులో అర్జున్ రెడ్డి ఇమేజ్ తెచ్చుకున్నాడు సోహెల్. కోపంతో పాటు ప్రేమను కూడా బాగానే చూపించాడు. చివరికి టాప్ 3లో నిలిచాడు సోహెల్. అంతేకాదు పాతిక లక్షల క్యాష్‌తో పాటు మరో 20 లక్షలు కూడా అదనంగా సంపాదించాడు సోహెల్. గత బిగ్ బాస్ సీజన్‌లో అందరికంటే ఎక్కువగా లాభపడింది అంటే ఈయనే. హీరో కావడమే తన లక్ష్యం అని చెప్పిన సోహెల్.. ఇప్పుడు తన కలను నెరవేర్చుకుంటున్నాడు. నిజానికి గతంలోనే యురేక అనే సినిమాలో హీరోగా నటించాడు సోహెల్. కానీ అది వచ్చిన వెళ్లినట్లు కూడా ఎవరికీ తెలియదు. పదేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నా ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాని సోహెల్‌కు బిగ్ బాస్ గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పటికే జార్జిరెడ్డి నిర్మాణ సంస్థతో ఓ సినిమా చేస్తున్నాడు సోహెల్‌. ఈ సినిమా గురించి గత డిసెంబర్‌లోనే ప్రకటన వచ్చింది. కానీ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. దీనికోసం ఇన్నాళ్ల సమయం తీసుకున్నారు. మార్చి 3న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. సోహెల్ హీరోగా రాబోతోన్న సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఫస్ట్ లుక్‌ విడుదల చేసారు. ఇందులో సోహెల్ మాస్ లుక్‌తో మాయ చేసాడు. చేతిలో సిగరెట్.. ఒళ్లంతా టాటూలు ఇలా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నాడు సోహెల్. కచ్చితంగా ఈ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటానని ధీమాగా చెప్తున్నాడు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్.
Published by:Praveen Kumar Vadla
First published: