BIGG BOSS 4 FAME MONAL GAJJAR TO DEBUT IN SMALL SCREEN AS JUDGE IN DANCE PLUS SHOW MNJ
Monal Gajjar: భలే ఛాన్స్ కొట్టేసిన మోనల్..మంచి ఆఫర్‌తో ప్రేక్షకుల ముందుకు గుజరాతీ భామ
మోనాల్(Photo: Star Maa)
మోనాల్ గజ్జర్(Monal Gjjar).. బిగ్‌బాస్ 4(Bigg Boss 4 Telugu) ప్రారంభమైనప్పటి నుంచి ఈ పేరు హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా వచ్చింది.
Monal Gajjar - Bigg Boss 4 Telugu: మోనాల్ గజ్జర్.. బిగ్‌బాస్ 4 ప్రారంభమైనప్పటి నుంచి ఈ పేరు హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్‌లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా వచ్చింది. ముఖ్యంగా హౌజ్‌లో అఖిల్- మోనాల్‌ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకే ఎలిమినేషన్ నామినేషన్లో ఉన్న మోనాల్‌ని చివరి వరకు కాపాడుతూ వచ్చి, ఆమె బదులు మిగిలిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తూ వచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి..అయితే అది వేరే విషయం. గ్రాండ్ ఫినాలే ముందు వారం మోనాల్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేయగా.. ప్రస్తుతం ఈ గుజరాతీ భామకు వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం స్టార్ మాలో ఈ బ్యూటీకి ఇప్పుడు బిగ్ ఆఫర్ వచ్చినట్లు టాక్. ఈ వారంతం నుంచి స్టార్ మాలో డ్యాన్స్ ప్లస్ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఓంకార్ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్‌కి సంబంధించి కొన్ని ఎపిసోడ్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇక ఈ షోకు జడ్జిలుగా బాబా భాస్కర్ మాస్టర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ తదితరులు ఉండబోతున్నారట.
ఇక వీరితో పాటు మోనాల్ కూడా ఒక జడ్జిగా ఉండబోతున్నట్లు సమాచారం. దీనిపై మరికొన్ని గంటల్లోనే స్పష్టత రానుంది. కాగా బిగ్‌బాస్‌లో పాల్గొనడం ద్వారా మోనాల్‌కి బాగానే ముట్టినట్లు టాక్. ఆమెకు దాదాపు రూ.30లక్షలు అందినట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు మోనాల్‌కి సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
రెండు ప్రాజెక్టులను ఓకే చేసినట్లు ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మోనల్. అటు తన బిగ్ బాస్ హౌస్ లవర్ బాయ్ అఖిల్‌తో కలిసి సినిమాలో నటించేందుకు సిద్ధమంటూ ఈ గుజరాతీ భామ టాలీవుడ్ నిర్మాతలను ఊరిస్తోంది. బిగ్ బాస్‌లో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగా పండినందున...సినిమా తీస్తే బాగుంటుందన్న యోచనలో కొందరు నిర్మాతలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెత్తానికి టాలీవుడ్లో భారీ అంచనాలతోనే కొత్త సంవత్సరం 2021ని మొదలుపెట్టనుంది మోనల్.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.