Bigg Boss 4 Sohel: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ 4 సమరం ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా అభిజీత్ గెలవగా.. అఖిల్ రన్నర్‌గా మిగిలారు. ఇక రూ.25లక్షలు తీసుకొని మూడో స్థానంలో నిలిచారు సొహైల్. అయితే టాప్ 3లో ఉన్న సమయంలో రూ. 25లక్షలు తీసుకొని సొహైల్ ఎలిమినేట్ అవ్వడంపై చాలా విమర్శలే వచ్చాయి. సొహైల్ డబ్బులకు కక్కుర్తి పడ్డాడని, ఏంటన్నా సొహైల్ ఇలా చేశావు అంటూ కొంతమంది సోషల్ మీడియాలలో కామెంట్లు పెట్టారు. మరోవైపు ఇటీవల రీయూనియన్ ఎపిసోడ్‌లో భాగంగా లోపలికి వెళ్లిన మెహబూబ్.. డబ్బులు తీసుకొని రమ్మని సొహైల్‌కి హింట్ ఇచ్చాడని చాలా కామెంట్లు వినిపించాయి. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ ప్రశ్నలు ఇప్పుడు సొహైల్‌కి మరోసారి ఎదురయ్యాయి.
ఇటీవల సొహైల్ ఓ లైవ్‌లో పాల్గొనగా.. డబ్బులకు కక్కుర్తి పడ్డావని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దాన్ని చదివిని సొహైల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అవును డబ్బుల కోసమే కదా బిగ్‌బాస్‌కి వెళ్లింది. నేను రూ.50లక్షల కోసం వెళ్లా. డబ్బులను తీసుకొని వచ్చా. బయటకు వచ్చాక నా రూమ్ రెంట్ కట్టుకోవాలి. నాకు ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నా బ్యాంకులో 15వేలు అలా ఉన్నాయి. బిగ్‌బాస్ నుంచి వచ్చే డబ్బులు ఇంకా నాకు రాలేదు. నా అవసరాలు నాకు ఉంటాయి కదా. ఏం నువ్వు వచ్చి కడవాతా..? అవన్నీ అంటూ సొహైల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక మరికొందరేమో వదిలేయ్ అన్న వారి మాటలను ఏం పట్టించుకోకు అంటూ కామెంట్‌లు పెట్టారు.
కాగా బిగ్‌బాస్ ద్వారా మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న సొహైల్.. గ్రాండ్ ఫినాలేలో ఎలిమినేట్ అయిన తరువాత మాట్లాడుతూ.. తనకు ఒక మంచి సినిమా చేయాలనుందని, దానికి మీ సపోర్ట్ కావాలంటూ చిరంజీవి, నాగార్జునను అడిగారు. అందుకు వారు ఓకే చెప్పారు. ఇక చిరంజీవి అయితే కావాలంటే తాను చిన్న కెమెరా అప్పియరెన్స్ ఇస్తానని మాటిచ్చాడు. మరోవైపు హాస్య నటుడు బ్రహ్మానందం కూడా సొహైల్ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా లేకుండా నటిస్తానని ప్రకటించారు. మరి సొహైల్‌తో ఎవరు సినిమాను తెరకెక్కించనున్నారో..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.