Bigg Boss 4 Sohel: బిగ్‌బాస్ 4 సీజన్లో టామ్ అండ్ జెర్రీగా గుర్తింపు తెచ్చుకున్నారు సొహైల్- అరియానా జంట. బిగ్‌బాస్ ప్రారంభమైన రెండు రోజులు నైబర్ హౌజ్‌లో ఉన్న ఆ ఇద్దరు.. హౌజ్‌లోకి వెళ్లిన తరువాత టామ్ అండ్ జెర్రీగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు అరుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టాస్క్‌లు చేసే సమయంలో, ఎలిమినేషన్‌కి నామినేషన్ చేసే సమయంలో వీరిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగేది. అయితే కొన్ని టాస్క్‌ల్లో మాత్రం ఈ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బావుండేది. ఇక కొన్ని సార్లు ఇద్దరు ఇద్దరిని బుజ్జగించుకోవడం కూడా వీక్షకులకు బాగా నచ్చేది. మొత్తానికి ఈ పెయిర్ ఈ సీజన్లో మంచి ఎంటర్టైన్మెంట్ని అందించింది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అరియానా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సొహైల్.
మీ ఇద్దరికి ముందు నుంచే ఫ్రెండ్ షిప్ ఉందా..? అన్న ప్రశ్నకు.. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మేమిద్దరం కలిశాము. బిగ్‌బాస్‌లోకి తాము వెళ్లేముందు హోటల్లో బాగా మాట్లాడుకున్నాము. ఆ తరువాత స్టేజ్ మీదకు వెళ్లిన తరువాత అరియానాను చూశాను. మా ఇద్దరిని మొదటగా నైబర్ హౌజ్‌లో పెట్టారు. అప్పుడు మేమిద్దరమే అక్కడ ఉండటం వలన మంచి చనువు ఏర్పడింది అని చెప్పుకొచ్చారు. ఇక అరియానా చాలా హైపర్ యాక్టివ్ అని.. తనకు నచ్చినట్లు తను ఉంటుందని.. అది చాలా మంచి క్వాలిటీ అని సొహైల్ ప్రశంసలు కురిపించారు. అయితే చివరగా అరియానాతో గొడవ బాధ అనిపించిందని తెలిపారు.
మరోవైపు హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో అభిజీత్ చాలా కోపంగా ఉండేవాడని.. అప్పుడు వీకెండ్లో నాగార్జున సర్ కోపం తగ్గించుకోమని అభికి చెప్పాడని.. ఆ సమయంలో నా కోపం గురించి చాలా ఆలోచించి.. రెండు వారాల పాటు తనను తాను ఆపుకున్నానని సొహైల్ వివరించారు. ఇక నాగార్జున సర్ వార్నింగ్ తరువాత తనలో చాలా మార్పు వచ్చిందని బిగ్‌బాస్ అనుభూతులను గుర్తుచేసుకున్నారు సొహైల్. కాగా బిగ్‌బాస్ నుంచి వచ్చిన తరువాత సొహైల్‌కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే హీరోగా ఓ సినిమాకు ప్రకటించారు సొహైల్. ఇక సొహైల్ హీరోగా నటించే సినిమాలో తాను కెమెరా పాత్రలో నటిస్తానని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హామీ ఇవ్వగా.. బ్రహ్మానందం సైతం ఆ మూవీలో ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటిస్తానని ప్రకటన ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.