BIGG BOSS 4 CONTESTANT SOHEL ONCE AGAIN TALKS ABOUT MEHBOOB CONTROVERSY PK
Bigg Boss Sohel: అల్లా కీ కసమ్.. మెహబూబ్ వీడియోపై సోహెల్ సంచలన కామెంట్స్..
మెహబూబ్ సోహైల్ (Mehboob sohail Bigg Boss)
Bigg Boss Sohel: బిగ్ బాస్ 4 అయిపోయి వారం కావొస్తున్నా కూడా ఇప్పటికీ దీనిపై చర్చలు మాత్రం ఆగడం లేదు. పైగా అక్కడ్నుంచి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ బాగా బిజీ అయిపోయారు.
బిగ్ బాస్ 4 అయిపోయి వారం కావొస్తున్నా కూడా ఇప్పటికీ దీనిపై చర్చలు మాత్రం ఆగడం లేదు. పైగా అక్కడ్నుంచి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ బాగా బిజీ అయిపోయారు. మరీ ముఖ్యంగా టాప్ 3 కంటెస్టెంట్స్ అయితే ఇంటర్వ్యూలతో రచ్చ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు. ఇంట్లో నడిచినట్లే బయట కూడా అఖిల్ వర్సెస్ అభిజీత్ వార్ కంటిన్యూ అవుతుంది. మరోవైపు సోహెల్ విషయంలో మరో వివాదం చెలరేగుతుంది. సోహెల్ ఇంట్లో ఉన్నపుడు మెహబూబ్ వచ్చాడు. అప్పుడు ఆయనకు డబ్బులు తీసుకోవాలంటూ సోహెల్‌కు ఆయన సైగలు చేసాడంటూ వీడియో ఒకటి వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఈ వీడియో తాలూకు ప్రశ్నలు కూడా సోహెల్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. మీకు మెహబూబ్ చెప్పాడు కాబట్టి.. చాలా తెలివిగా మూడో స్థానం నుంచి క్విట్ అయిపోయారంట కదా అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో సోహెల్‌కు ప్రశ్న వచ్చింది.
సోహెల్ Photo : Twitter
అప్పుడు ఆయన కూడా చాలా సీరియస్‌గా సమాధానం చెప్పాడు. నిజంగా ఆ రోజు మెహబూబ్ ఏమన్నాడో నాకు తెలియదు.. వాడు అన్నది కూడా నాకు అర్థం కాలేదు.. అంత డౌట్ ఉంటే బిగ్ బాస్ వాళ్లను వీడియో వేయమనండి.. మళ్లీ చూస్కోండి లిప్ లింక్‌తో సహా ఉంటది అంటూ సోహెల్ చెప్తున్నాడు. వాడు చెప్పింది నాకు అర్థం కాలేదు మొర్రో అంటుంటే దానివల్లే బయటికి వచ్చానని చెప్పడం అస్సలు బాగోలేదంటున్నాడు సోహెల్.
అల్లా కి కసమ్ అని ఊరికే అనరని.. ఇప్పుడు తాను అంటున్నానని.. ఆ రోజు నిజంగా మెహబూబ్ తనకు డబ్బులు తీసుకోమని చెప్పలేదని చెప్పాడు సోహెల్. అసలు టాప్ 3లో ఉన్న వాళ్లకు 25 లక్షలు ఇస్తారని ఎవరైనా మెహబూబ్‌కు స్క్రిప్ట్ రాసిచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నీ పుకార్లే కానీ నిజాలు కావంటున్నాడు ఆయన. తనకు ఫినాలే అయిపోయి.. స్టేజీ దిగిన తర్వాత మెహబూబ్ ఈ వీడియో వైరల్ అవుతుందని చూపించాడని.. అప్పటి వరకు అలాంటిది ఒకటి ఉందని కూడా తనకు తెలియదు అంటున్నాడు సోహెల్.
బిగ్ బాస్ 4 తెలుగు
ఏదేమైనా కూడా కేవలం తన స్నేహితుడి వల్లే డబ్బులు వచ్చాయనడం మాత్రం దారుణం అంటున్నాడు సోహెల్. ప్రస్తుతం ఈయన సినిమాలతో బిజీ అవుతున్నాడు. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బ్రహ్మానందం, చిరంజీవి లాంటి స్టార్స్ ఈయనకు ఆఫర్స్ ఇచ్చారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.