Bigg Boss 4 Sohel: గత సీజన్లకు భిన్నంగా ఈసారి బిగ్‌బాస్ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్లో మూడో స్థానంలో డ్రాప్ అయ్యే కంటెస్టెంట్‌కి విన్నర్ అమౌంట్లో నుంచి సగం డబ్బులను ఇప్పించారు నిర్వాహకులు. ఇలా అభిజీత్ విన్నింగ్ డబ్బులు రూ.50లక్షల నుంచి రూ.25లక్షలను మూడో స్థానంలో డ్రాప్ అయిన సొహైల్‌కి రూ.25లక్షలు వచ్చాయి. అయితే దీనిపై మిశ్రమ కామెంట్లు వినిపించాయి. విన్నర్ డబ్బుల నుంచి ఇవ్వడమేంటని కొందరు ప్రశ్నించగా.. సొహైల్‌కి డబ్బులు అవసరయని.. అతడికి ఇచ్చేందుకే బిగ్‌బాస్ నిర్వాహకులు ఈ ప్లాన్ చేశారని కామెంట్లు చేశారు. ఇక మరికొందరేమో మొత్తానికి అభిజీత్, సొహైల్‌కి న్యాయం జరిగింది. కానీ మధ్యలో అఖిల్‌కి అన్యాయం జరిగిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇదే ప్రశ్న ఇటీవల సొహైల్‌కి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. అభిజీత్ విన్నర్ అయ్యాడు. మీకు రూ.25లక్షలు వచ్చాయి. కానీ మధ్యలో అఖిల్‌కి అన్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు..? అన్న ప్రశ్నకు.. అసలు అఖిల్‌కి ఎక్కడ అన్యాయం జరిగిందని సొహైల్ ప్రశ్నించాడు. హౌజ్‌లోకి వచ్చినప్పుడే తాను టాప్ 2లో ఉంటానని అనుకొని అఖిల్ వచ్చాడని.. ఇప్పుడు అతడి కోరిక నెరవేరిందని తెలిపాడు. విన్నర్ గురించి పక్కనపెడితే అఖిల్ తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడని పేర్కొన్నాడు.
హౌజ్‌లోకి వెళ్లిన తరువాత ఒక నెలకే బయటకు వెళ్తానని కూడా అఖిల్ అనుకున్నాడని.. కానీ చివరి వరకు ఉండగలిగాడని వివరించారు. ఇక తామిద్దరిలో ఎవరు గెలిచినా.. డబ్బులు చెరీసగం చేసుకుంటామని అనుకున్నామని.. ఇప్పుడు తాను గెలిచిన రూ.25లక్షల అమౌంట్లో నుంచి డబ్బులు ఇస్తానని చెప్పినా అఖిల్ తీసుకోడని తెలిపాడు. నేను నా విన్నింగ్ డబ్బులలో నుంచి రూ.5లక్షలు మెహబూబ్‌కి ఆఫర్ చేస్తే తీసుకోలేదని.. అఖిల్ కూడా అంతేనని వివరించాడు. అఖిల్, తనకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్సుకొచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.