Sohel Bigg Boss 4: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్ ఇటీవలే ముగిసింది. అభిజీత్ విజేతగా, అఖిల్ రన్నర్‌గా మిగిలారు. ఇక మూడో స్థానంలో నిలిచినప్పటికీ.. ఇందులో పాల్గొనడం ద్వారా మంచి ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు సింగరేణి ముద్దు బిడ్డ సొహైల్. హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో యాంగ్రీ మ్యాన్ యాట్యిట్యూడ్తో ఉంటే సొహైల్.. ఆ తరువాత తనను తాను మార్చుకుంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇప్పుడు మంచి ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటున్నాడు. ఇక బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సమయంలో తనకు మంచి సినిమాలో నటించాలనుందని కోరికను బయటపెట్టడం.. అందుకు తమ వంతు సాయం చేస్తామని చిరంజీవి, నాగార్జున చెప్పడంతో.. బయట వచ్చిన మూడు రోజులకే మూవీ ఆఫర్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే పలువురు దర్శకులు కూడా సొహైల్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్లు టాక్.
కాగా హౌజ్‌లో ఉన్నప్పుడు సొహైల్ ఎక్కువగా ఎవరితో గొడవపడ్డాడు అంటే.. వెంటనే అరియానా పేరు వినిపిస్తుంది. వీరిద్దరు హౌజ్‌లో టామ్ అండ్ జెర్రీగా మారారు. టాప్ 5లో ఉన్న ఈ ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఒకరిపై మరొకరికి ఎంత కోపం ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ ఇద్దరు ఒకరిని మరొకరు చాలా అర్థం చేసుకునేవారు. ఆ ఎపిసోడ్లో వీక్షకులను కూడా బాగా మెప్పించాయి. దీంతో వీరి పెయిర్‌కి మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది.
ఇక బయటకు వచ్చిన తరువాత తమ వీడియోలను చూశానని.. అవి చాలా క్యూట్‌గా అనిపించాయని సొహైల్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సొహైల్.. అరియానా, నా వీడియోలను కొంతమంది ఎడిట్ చేసి నాకు పంపారు. అలాగే కొన్ని ప్రోమోలను కూడా చూశా. అవి చూస్తుంటే నాకు చాలా క్యూట్‌గా అనిపించాయి. లాస్ట్ గొడవ వీడియో తప్ప అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం తాను ఇంటికి వెళతానని.. అక్కడ చెల్లి పెళ్లి అయిన తరువాత మళ్లీ సిటీకి వస్తానని సొహైల్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.