Home /News /movies /

BIGG BOSS 4 CONTESTANT AVINASH SENSATIONAL COMMENTS ON JABARDASTH COMEDY SHOW PK

Jabardasth Avinash: నమ్ముకున్న జబర్దస్త్ నట్టేట ముంచేసింది.. అవినాష్ సంచలన వ్యాఖ్యలు..

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

Jabardasth Avinash: జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అవినాష్. దానికంటే ముందే ఈయన మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సాయి కుమార్ వాయిస్ అచ్చుగుద్దినట్లు దించేస్తుంటాడు.

జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అవినాష్. దానికంటే ముందే ఈయన మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సాయి కుమార్ వాయిస్ అచ్చుగుద్దినట్లు దించేస్తుంటాడు. అలాంటి సమయంలోనే జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అక్కడ్నుంచి నిలబడ్డాడు అవినాష్. అయితే ఇప్పుడు అదే జబర్దస్త్ కారణంగా తాను అప్పులపాలయ్యాను అంటూ సంచలన కామెంట్స్ చేసాడు జబర్దస్త్ అవినాష్. కేవలం ఈ షో తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ సమయంలోనే ఈయనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పుడు జబర్ధస్త్ షోలో ఈయన టీం లీడర్‌గా ఉన్నాడు. ఈ షోలో ఆఫర్ రావడంతో తప్పక వెళ్లాల్సి వచ్చిందని.. అయితే రెండింట్లో ఏది ముఖ్యం అనుకుంటే బిగ్ బాస్ ఎంచుకున్నానని చెప్పాడు. అప్పుడు తన నుంచి 10 లక్షలు జబర్దస్త్ టీం వసూలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అలాంటి క్లిష్ట సమయంలో యాంకర్ శ్రీముఖితో పాటు గెటప్ శ్రీను, చమ్మక్ చంద్రలు అండగా నిలిచారని చెప్పాడు.
jabardasth avinash,jabardasth avinash comments,jabardasth avinash suicide attempt,jabardasth avinash remuneration in bigg boss 4 telugu,jabardasth avinash twitter,jabardasth avinash skits,jabardasth avinash movies,jabardasth avinash 10 lakhs to mallemala,jabardasth avinash fine 10 lakhs,jabardasth avinash bigg boss 4,jabardasth avinash bigg boss 4 contestant,telugu cinema,జబర్దస్త్ అవినాష్,జబర్దస్త్ అవినాష్ స్కిట్స్,జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ 4,జబర్దస్త్ అవినాష్ మల్లెమాలకు 10 లక్షలు ఫైన్,జబర్దస్త్ అవినాష్ రెమ్యునరేషన్ బిగ్ బాస్ 4,జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అవినాష్
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

వాళ్లు డబ్బు సాయం చేయకపోయుంటే ఈ రోజు ఇలా ఉండేవాడిని కానేమో అంటున్నాడు అవినాష్. ఈయన ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్తూ సింపతీ బాగానే ప్లే చేసాడు కూడా. ఇల్లు కట్టానని.. అప్పుడే అమ్మకు ఆరోగ్యం బాగోలేదని.. దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయని చెప్పాడు అవినాస్. అదే సమయంలో లాక్‌డౌన్ కూడా రావడంతో ఒకానొక సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు కూడా చెప్పాడు అవినాష్. ఆ తర్వాత బిగ్ బాస్ ఆఫర్ రావడంతో నిలబడినట్లు చెప్పాడు. హోల్ సీజన్‌కే బెస్ట్ ఎంటర్‌టైనర్ అయిపోయాడు.
jabardasth avinash,jabardasth avinash comments,jabardasth avinash suicide attempt,jabardasth avinash remuneration in bigg boss 4 telugu,jabardasth avinash twitter,jabardasth avinash skits,jabardasth avinash movies,jabardasth avinash 10 lakhs to mallemala,jabardasth avinash fine 10 lakhs,jabardasth avinash bigg boss 4,jabardasth avinash bigg boss 4 contestant,telugu cinema,జబర్దస్త్ అవినాష్,జబర్దస్త్ అవినాష్ స్కిట్స్,జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ 4,జబర్దస్త్ అవినాష్ మల్లెమాలకు 10 లక్షలు ఫైన్,జబర్దస్త్ అవినాష్ రెమ్యునరేషన్ బిగ్ బాస్ 4,జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అవినాష్
జబర్దస్త్ అవినాష్ (avinash bigg boss)

అక్కడ్నుంచి వచ్చిన తర్వాత అప్పులన్నీ తీరిపోయాయని చెప్పాడు అవినాష్. జబర్ధస్త్ కోసం చేసిన 10 లక్షలతో పాటు తన అప్పులన్నీ తీరిపోయాయని చెప్పాడు ఈయన. ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న వాళ్ళలో అవినాష్ కూడా ఉన్నాడు. ఈయనకు రోజుకు దాదాపు 50 వేలకు పైగానే చెల్లించినట్లు తెలుస్తుంది. ఓవరాల్‌గా బిగ్ బాస్ నుంచి 40 లక్షలకు పైగానే అవినాష్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ వల్లే అప్పుల పాలయ్యానని అవినాష్ చెప్పడం మాత్రం నిజంగానే సంచలనం.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Jabardasth avinash, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు