హోమ్ /వార్తలు /సినిమా /

Lasya Manjunath: రెట్టింపైన‌ లాస్య సంతోషం.. ఆనందంతో స్టెప్పులు వేసిన యాంక‌ర్

Lasya Manjunath: రెట్టింపైన‌ లాస్య సంతోషం.. ఆనందంతో స్టెప్పులు వేసిన యాంక‌ర్

లాస్య మంజునాథ్

లాస్య మంజునాథ్

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్, యాంక‌ర్ లాస్య మంజునాథ్(Lasya Manjunath) సంతోషంలో తేలిపోతోంది. ఆనందంతో స్టెప్పులు వేస్తూ త‌న సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. దేవుడికి థ్యాంక్స్ చెబుతూ.. ఇక‌పై సంద‌డి మ‌ళ్లీ మొద‌లవుతుంద‌ని అంటోంది.

Lasya Manjunath: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్, యాంక‌ర్ లాస్య మంజునాథ్ సంతోషంలో తేలిపోతోంది. ఆనందంతో స్టెప్పులు వేస్తూ త‌న సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. దేవుడికి థ్యాంక్స్ చెబుతూ.. ఇక‌పై సంద‌డి మ‌ళ్లీ మొద‌లవుతుంద‌ని అంటోంది. ఇంత‌కు లాస్య.. ఇంత‌లా సంతోష‌ప‌డ‌టానికి కార‌ణ‌మేంటంటే.. ఆమె యూట్యూబ్ ఛానెల్ లాస్య టాక్స్ బ్యాక్ రావ‌డ‌మే. కాగా ఇటీవ‌ల లాస్య యూట్యూబ్ ఛానెల్ హ్యాక్‌కి గురైంది. యూట్యూబ్‌లో లాస్య టాక్స్ క‌నిపించ‌క‌పోగా.. చాలా మంది అభిమానుల‌కు ఆమెకు మెసేజ్‌లు పెట్టారు. దీంతో త‌న అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు లాస్య గుర్తించింది. ఆ త‌రువాత ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించిన లాస్య‌.. ఎవ‌రో నా అకౌంట్‌ని హ్యాక్ చేశార‌ని తెలిసింది. నా టెక్నిక‌ల్ టీమ్ ఇప్పుడు దాని మీద వ‌ర్క్ చేస్తుంది అని తెలిపింది. అభిమానులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని లాస్య పేర్కొంది.

ఇక తాజాగా త‌న అకౌంట్ మ‌ళ్లీ బ్యాక్ వ‌చ్చేసింది. టెక్నిక‌ల్ టీమ్ దానిపై వ‌ర్క్ చేసి లాస్య అకౌంట్‌ని బ్యాక్ తీసుకొచ్చింది. ఈ విషయాన్ని లాస్య త‌న యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపింది. నా అకౌంట్ హ్యాక్‌కి గురైంద‌ని తెలిసిన‌ప్పుడు నాకు చాలా బాధ వేసింది. అయితే అప్పుడు నాకు చాలా మంది ధైర్యం చెప్పారు. ఇప్పుడు నేను తిరుప‌తికి వ‌చ్చా. నా అకౌంట్ మ‌ళ్లీ బ్యాక్ వ‌చ్చిన‌ట్లు మా టెక్నిక‌ల్ టీమ్ తెలిపింది. ఇక్క‌డ‌కు రాగానే శుభ‌వార్త‌ను విన్నా.  ఇంకా కొంత వర్క్ ఉంది. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లు టీమ్ తెలిపింది. దానిపైనే టీమ్ పనిచేస్తోంది. మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేసేందుకు ఇంకా వీడియోలు ఉన్నాయి. వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శ‌నం చేసుకొని వ‌చ్చిన త‌రువాత ఓ లైవ్ చేస్తాను. అప్పుడు మీతో మాట్లాడితే నా మ‌న‌సు మ‌రింత హాయిగా ఉంటుంది.  ఈ స‌మ‌యంలో నాకు మ‌ద్ద‌తుగా నిలిచిన అంద‌రికీ, నాకు ధైర్యం చెప్పి అంద‌రికీ నిజంగా థ్యాంక్స్ అని లాస్య వెల్ల‌డించింది.


ఇక మ‌రో వీడియోలో నా యూట్యూబ్ ఛానెల్ బ్యాక్ వచ్చేసిందంటూ.. నువ్వొస్తానంటే నేనొద్దానంటే చిత్రంలోని ఘ‌ల్ ఘ‌ల్ పాట మ్యూజిక్‌కి స్టెప్పులు వేసింది. మ‌రోవైపు లాస్యకు ఫ్యాన్స్ కూడా అభినంద‌న‌లు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.


ఇదిలా ఉంటే ర‌వితో క‌లిసి లాస్య ఐదు సంవ‌త్స‌రాల త‌రువాత యాంక‌ర్‌గా మ‌ళ్లీ ఇవ్వ‌బోతోంది. స్టార్ మాలో సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌సారం కానున్న ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ ప్రోగ్రామ్ కోసం ఈ ఇద్ద‌రు యాంక‌రింగ్ చేశారు.

First published:

Tags: Anchor lasya

ఉత్తమ కథలు