Bigg Boss 4: బిగ్‌బాస్‌‌ హౌస్‌లో ఎంట్రీ ఇస్తోన్న బిత్తిరి సత్తి..

ఈ  రియాలిటీ షోకు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే డౌట్ ఉండేది. కానీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ప్రేక్షకులు బాగనే కనెక్ట్ అయ్యారు. తెలుగులో ఈ రియాలిటీ షో ఇప్పటకే  మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా నాల్గో సీజన్‌లో బిత్తిరి సత్తి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: June 24, 2020, 1:43 PM IST
Bigg Boss 4: బిగ్‌బాస్‌‌ హౌస్‌లో ఎంట్రీ ఇస్తోన్న బిత్తిరి సత్తి..
బిగ్‌బాస్‌లోకి బిత్తరి సత్తి (File/Photos)
  • Share this:
ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. ఆ తర్వాత మన దేశంలో ప్రసారమైంది. నార్త్‌లో  ముందు హిందీలో ఈ ప్రోగ్రామ్‌ ప్రసారమైంది. అక్కడి ప్రజలు ఈ షోను బాగానే ఓన్ చేసుకున్నారు. సౌత్‌లో ఈ  రియాలిటీ షోకు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే డౌట్ ఉండేది. కానీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ప్రేక్షకులు బాగనే కనెక్ట్ అయ్యారు. తెలుగులో ఈ రియాలిటీ షో ఇప్పటకే  మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇపుడు నాల్గో సీజన్‌కు మొదలు కావడానికి చాలా సమయం ఉన్న ఇప్పటి నుంచే ఈ సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. రెండు మూడు సీజన్స్‌తో పోలిస్తే.. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. తెలుగు ఆడియన్స్‌కు ఏ మాత్రం తెలియని ఈ  రియాల్టీ షోను జూనియర్ ఎన్టీఆర్ విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇపుడు నాల్గో సీజన్ కోసం స్టార్ మా వాళ్లు ప్రిపేర్ అవుతున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ యేడాది సీజన్ కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. అక్టోబర్‌లో బిగ్‌బాస్ 4 సీజన్ మొదలు కానున్నట్టు సమాచారం.

బిగ్‌బాస్ మొదటి మూడు సీజన్ల యాంకర్లు (Twitter/Photo)


ఈ సారి మరింత భారీగానే బిగ్‌బాస్ 4 ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగానే ఇప్పట్నుంచే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరుగుతుంది. తాజాగా బిగ్‌బాస్ 4 లో ప్రముఖ యాంకర్ బిత్తిరి సత్తి కూడా పార్టిసిపేట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే టీవీ 9 యాజమాన్యంతో  ఓ ప్రోగ్రామ్ కారణంగా వచ్చిన విభేదాల కారణంగా బిత్తరి సత్తి అందులోంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో స్టార్ మా వాళ్లు మాస్‌లో ఫాలోయింగ్ ఉన్న బిత్తిరి సత్తిని సంప్రదించి బిగ్‌బాస్ హౌస్‌లో పార్టిసిపేట్‌గా అవకాశామిచ్చినట్టు సమాచారం. ఇప్పటికే మొదటి మూడు సీజన్ల కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు బిత్తిరి సత్తిని సంప్రదించగా.. అప్పట్లో బిత్తిరి సత్తి బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. నాల్గో సీజన్ కోసం అడిగారు. మొన్నటి వరకు టీవీ9లో ఉండటంతో ఓకే చెప్పలేదు. కానీ ప్రస్తుతం టీవీ 9 నుంచి బయటకు రావడంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడానికి ఉన్న అడ్డంకులు తొలిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు  నేపథ్యంలో బిత్తిరి సత్తికి బిగ్‌బాస్‌లోకి ఆఫర్ రావడం.. దానికి బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి ఓకే చెప్పిన్నట్టు వార్తలు వస్తున్నాయి.

tv9 anchor bittiri satti alias chevella ravi out of tv 9 here are the reasons,tv9 anchor bittiri satti quits tv 9,tv 9 remove anchor bittiri satti, Chevella Ravi,Bithiri Sathi,Bithiri Sathi v6 news,Bithiri Sathi teenmaar varthalu,teenmaar varthalu bithiri sathi,teenmaar bithiri sathi,teenmaar sathi,teenmaar varthalu v6,bithiri sathi v6 news resign,bithiri sathi v6 news resign reasons,Bittiri Satti Good Bye to V6 News,Bittiri Satti Good Bye to V6 News reasons,bithiri sathi tv9 telugu,ismart news bithiri sathi,tv9 telugu live,telugu cinema,బిత్తిరి సత్తి,రవికుమార్,చేవెల్ల రవి,బిత్తిరి సత్తి వి6 న్యూస్,బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు,బిత్తిరి సత్తి వి6 వదిలేయడానికి కారణాలు ఇవే,టీవీ నుంచి బయటకు వచ్చిన బిత్తిరి సత్తి, టీవీ 9 నుంచి బిత్తిరి సత్తి ఔట్
బిత్తిరి సత్తి ఫైల్ ఫోటో


బిగ్‌బాస్ హౌస్‌లోకి  బిత్తిరి సత్తితో పాటు మరో నలుగురు కంటెస్టెంట్స్‌ను ఇప్పటికే ఫైనలైజ్ చేసారని తెలుస్తుంది. అందులో ఒకరు ఒకప్పటి లవర్ బాయ్ హీరో తరుణ్‌ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈయన పేరు మూడో సీజన్‌కు కూడా వినిపించింది. కానీ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది. ఇక సింగర్ కమ్‌ యాంకర్ మంగ్లీ.. మరో హాట్ యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్‌.. సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్‌ ఈ లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
First published: June 24, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading