గ్రాండ్ ఫినాలే రోజు చిరంజీవి(Chiranjeevi) తన వేదాలం రీమేక్(Vedalam Remake)లో దివికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం దివి(Divi)కి ఇప్పుడు పవర్‌స్టార్ సినిమాలోనూ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
Bigg Boss 4 Divi: తెలుగు బిగ్‌బాస్‌లో పాల్గొన్నా ఏం లాభం..? అందులో పాల్గొన్న వారికి ఆ తరువాత ఏం ఆఫర్లు వచ్చాయి..? ఇలాంటి ప్రశ్నలు మొన్నటివరకు బాగా వినిపించాయి. ఎందుకంటే మొదటి మూడు సీజన్లలో పాల్గొని బయటకు వచ్చిన తరువాత ఎవరూ అంత బిజీగా మారలేదు. కానీ బిగ్‌బాస్ 4లో పాల్గొన్న వారు అలా కాదు. ఇందులో పాల్గొన్న వారిలో చాలా మంది ఇప్పుడు బిజీ అయిపోతున్నారు. మోనాల్ ఇప్పటికే అల్లుడు అదుర్స్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో చేయడంతో పాటు డ్యాన్స్ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. స్వాతి దీక్షిత్‌కి ఆర్జీవీ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు స్టేజ్‌పైన వెల్లడించింది. ఇక సొహైల్ హీరోగా మారడంతో పాటు సినిమాను ప్రకటించాడు. అంతేకాదు అభిజీత్, మెహబూబ్‌లు కూడా చిరు సినిమాలలో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇలా చాలా మంది ఇప్పటికే బిజీగా మారిపోయారు. ఇక ఈ సీజన్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దివి వాత్యాకి అయితే అవకాశాలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఎలిమినేట్ అయ్యే రోజు హీరో కార్తికేయ తన సినిమాలో దివికి ఆఫర్ ఇస్తాను అని చెప్పాడు.
ఇక గ్రాండ్ ఫినాలే రోజు చిరంజీవి తన వేదాలం రీమేక్‌లో దివికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు.. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం దివికి ఇప్పుడు పవర్‌స్టార్ సినిమాలోనూ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. పవన్, రానాలు మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్ నిర్మిస్తోంది. ఇక ఇందులో ఓ పాత్ర కోసం దివిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల వకీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.