హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 4 Akhil: బిగ్ బాస్ రన్నరప్ అఖిల్‌కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని..

Bigg Boss 4 Akhil: బిగ్ బాస్ రన్నరప్ అఖిల్‌కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని..

అఖిల్ సార్థక్ (Akhil Bigg Boss)

అఖిల్ సార్థక్ (Akhil Bigg Boss)

Bigg Boss 4 Akhil: ఎక్కడైనా అభిమానులకు సెలబ్రిటీస్ గిఫ్టులు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం జరిగింది. నచ్చిన వాడికి అభిమాని తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చింది. ఇది నిజంగానే చిత్రం. బిగ్ బాస్ 4 తెలుగుతో తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువైన..

ఇంకా చదవండి ...

ఎక్కడైనా అభిమానులకు సెలబ్రిటీస్ గిఫ్టులు ఇస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం జరిగింది. నచ్చిన వాడికి అభిమాని తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చింది. ఇది నిజంగానే చిత్రం. బిగ్ బాస్ 4 తెలుగుతో తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువైన నటుడు అఖిల్ సార్థక్. దానికి ముందు కూడా కొన్ని సీరియల్స్, సినిమాలు చేసినా అఖిల్‌కు కోరుకున్న గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఈయనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఈయన ముందు వచ్చినపుడు ఎవరో కూడా ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత తనను తాను బాగానే పరిచయం చేసుకున్నాడు అఖిల్. తనదైన ఆటతో అభిమానులను సంపాదించుకున్నాడు ఈయన. సీజన్ 4లో విన్నర్‌గా అభిజీత్ నిలిస్తే.. రన్నరప్ హోదాతో సరిపెట్టుకున్నాడు అఖిల్ సార్థక్. బయటికి వచ్చిన తర్వాత కూడా ఈయనపై అభిమానం అలాగే ఉండిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన. అంతే కాదు తాను ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా తనకు నచ్చిన వస్తువు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు అఖిల్. ఇప్పుడు అది నిజమైంది కూడా. తనకు నచ్చిన ల్యాప్ టాప్‌ను ఓ అభిమాని గిఫ్ట్ ఇచ్చింది.


విజయవాడ నుంచి జయలక్ష్మి అనే అభిమాని అఖిల్‌కు ల్యాప్ టాప్ ఇచ్చింది. నా మీద ఎందుకింత ప్రేమ.. నేనేం చేసాను అంతగా నాకు కూడా అర్థం కావడం లేదు.. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడిపోయాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు అఖిల్ సార్థక్.

First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు