Abijeet Bigg Boss 4: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్ తెలుగులో ఇటీవల పూర్తి అయిన విషయం తెలిసిందే. హౌజ్‌లోకి వెళ్లినప్పటి నుంచి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అభిజీత్ ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు. మొత్తం 11 సార్లు నామినేట్ అయినప్పటికీ.. ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చిన అభి.. చివరకు విన్నర్‌గా నిలిచాడు. అంతేకాదు ఒక్కసారి కూడా కెప్టెన్ కాకుండానే బిగ్‌బాస్ విజేత ట్రోఫీని గెలుచుకున్న కంటెస్టెంట్‌గా హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇక మిస్టర్ కూల్‌గా పేరొందిన అభిపై.. చివర్లో బిగ్‌బాస్ సైతం ఎన్నో ప్రశంసలు కురిపించారు. ఇలాంటి కంటెస్టెంట్ ఇంతవరకు ఎవరూ లేరని కామెంట్లు చేశారు. ఇక బయటకు వచ్చిన తరువాత అభిజీత్ ఇస్తోన్న ఇంటర్వ్యూలను చూస్తూ మరికొందరు అతడి యాట్యిట్యూడ్‌కి ఫిదా అవుతున్నారు.
కాగా ఉన్నట్లుండి ఇప్పుడు అభిజీత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఆల్‌వేస్ విత్ అభిజీత్ అంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. బిగ్‌బాస్ అయిపోయింది. అభిజీత్‌ని మిస్ అవుతున్నాము అంటూ మరికొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఇప్పుడు ఇండియా వైడ్ అభిజీత్ ట్రెండ్ అవుతున్నాడు.
అయితే బిగ్‌బాస్ 4 ట్రోఫీని గెలిచిన తరువాత అభిజీత్‌కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్టార్ మా వాళ్లు అభిజీత్‌తో ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో కూడా అభి కోసం ఓ ప్రోగ్రామ్‌ని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక పలువురు దర్శకులు కూడా అభిజీత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. చూస్తుంటే అభి బిజీగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.