బిగ్ బాస్ అభిజిత్, యాంకర్ రవికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

BiggBossTelugu4 | వర్షిణి తాజాగా అభిజిత్ గురించి పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బయటపెట్టింది. ఏంటంటే అభిజిత్ కు టెలివిజన్ స్టార్ యాంకర్ రవికి మధ్య ఉన్న రిలేషన్ ను అందిరికీ తెలియజేసింది.

news18-telugu
Updated: November 24, 2020, 7:36 PM IST
బిగ్ బాస్ అభిజిత్, యాంకర్ రవికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు..
యాంకర్ రవి, అభిజిత్
  • Share this:

BiggBossTelugu4 | బిగ్ బాస్ ద్వారా ప్రస్తుతం బాగా పాపులారిటీ సంపాదించిన స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది అభిజిత్ అనే చెప్పాలి. బిగ్ బాస్ కు ముందు 3, 4 సినిమాల్లో తళుక్కున మెరిసిన అభిజిత్ కు పెళ్లిగోల వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు సంపాదించారు. అలాగే అదే పాపులారిటీతో అభిజిత్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడనే చెప్పాలి. అయితే గేమ్ స్టార్టింగ్ లో పెద్దగా ఆకట్టుకోని అభిజిత్ ప్రస్తుతం వైరల్ జ్వరంలా జనాల్లోకి ఎక్కేశాడనే చెప్పాలి. ఎప్పటికప్పుడు నామినేషన్ కు వస్తూ తన స్వంత యాటిట్యూడ్ తో అభిజిత్ ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నాడనే చెప్పాలి. ప్రస్తుతం గెలుపు గుర్రాల్లో ముందు వరుసలో ఉన్న అభిజిత్ పట్ల అటు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. గతంలో కౌషల్ తరహాలోనే అభిజిత్ కు ఆర్మీ ఏర్పడింది. అటు సెలబ్రిటీలు కూడా అభిజిత్ యే తమ ఫేవరేట్ కంటెస్టెంట్ అని చెప్పేస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్న మోనల్ తల్లి గత శనివారం తన ఫేవరేట్ కంటెస్టెంట్ అభిజిత్ అని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు తన కూతురితో ఎంతో సన్నిహితంగా ఉన్న అఖిల్ ను కూడా ఆమె పట్టించుకోకుండా అభిజిత్ కే ఓటు వేసింది.


Read Also: గర్భవతితో వివహేతర సంబంధం.. చివరికి దారుణ హత్య

తాజాగా పెళ్లి గోల వెబ్ సిరీస్ లో అభిజిత్ కు జంటగా నటించిన యాంకర్ వర్షిణి కూడా అభిజిత్ కే ఓటేసింది. ఈ విషయంలో యాంకర్ వర్షిణి తన స్నేహితుడు ఢీ జోడీ అయిన హైపర్ ఆదిని సైతం పక్కన పెట్టి మరీ అభిజిత్ కు సపోర్ట్ చేసింది. అయితే హైపర్ ఆది మాత్రం తన జబర్దస్త్ మేట్ అవినాష్ కు మద్దతుగా నిలిచాడు. ఇదిలా ఉంటే వర్షిణి తాజాగా అభిజిత్ గురించి పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బయటపెట్టింది. ఏంటంటే అభిజిత్ కు టెలివిజన్ స్టార్ యాంకర్ రవికి మధ్య ఉన్న రిలేషన్ ను అందిరికీ తెలియజేసింది. యాంకర్ రవి, బిగ్ బాస్ అభిజిత్ ఇద్దరూ వరుసకు కజిన్స్ అవుతారని పేర్కొంది.

నిజానికి సినిమా ఇండస్ట్రీలో బంధుత్వం అనేది చాలా కామన్, ఆ పాయింట్ మీదనే అవకాశాలను సైతం పొందుతుంటారు. అయితే బిగ్ బాస్ నేపథ్యంలో అభిజిత్ చాలా మంచి పేరు సంపాదించారు. మరి బిగ్ బాస్ అతడికి అవకాశాను మెరుగుపరుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
Published by: Krishna Adithya
First published: November 24, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading