Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: November 3, 2019, 1:38 PM IST
ఒకవేళ కుదరని పక్షంలో అతడు ఇంటి ముఖం పట్టాల్సిందే.. ఒకటి రెండు వారాలు అయిన తర్వాత పూర్తిగా కోలుకున్నాక మధ్యలో వచ్చే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు.
ప్రస్తుతం తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ 3 చివరి దశకు చేరుకుంది. విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్‌ను ఎన్టీఆర్ ఎంతో హుందాగా డీల్ చేసాడు. రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన నాని మాత్రం కాస్తంత తడబడ్డాడు. కానీ ఈ రెెండు సీజన్స్‌లో విజేతలైన శివ బాలాజీ, కౌశల్‌లు ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. ఇక బిగ్‌బాస్ సీజన్ వన్‌లో గెలిచిన శివ బాలాజీకి సినిమాలో ఏమన్న పెద్దగా పొడిచాడా అంటే సమాధానం లేదు. గెలిచాకా రెండు మూడు ఛానెల్స్ తిరిగి ఓ వారం రోజులు కాస్తంత హడావుడి కనిపించింది. ఆ తర్వాత శివ బాలాజీ ఏం చేస్తున్నాడన్నది కూడా ప్రజలకు తెలియదు. తెలియదు అనే కంటే అసలు శివ బాలాజీ ఎవరనే విషయం ప్రేక్షకులు కూడా మరిచిపోయారు.బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాలు చేసే శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఉన్న ఛాన్సులు కూడా లేకుండా పోయాయి.

బిగ్‌బాస్ 1 విజేత శివ బాలాజీ (Star Maa/Photo)
బిగ్‌బాస్ మొదటి సీజన్ పక్కనపెడితే.. రెండో సీజన్లో ఈ వాడి వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కోసం ఏకంగా ఆయన పేరు మీద కౌశల్ ఆర్మీ వెలిసింది. అంతేకాదు ఆయన బిగ్‌బాస్ 2 విజేతగా నిలవాలని ఎన్ఆర్ఐలు ర్యాలీలు కూడా తీసారు. మరోవైపు కౌశల్ ఆర్మీ రన్ అంటూ నానా రచ్చ చేసి సంగతి తెలిసిందే కదా. అంతేకాదు బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’లో ముఖ్యపాత్రలో కౌశల్ నటించే ఛాన్స్ కొట్టేసాడాని సోషల్ మీడియాలో చెవులు కొరుక్కున్నారు. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కౌశల్‌తో పాటు శివ బాలాజీని పూర్తిగా మరిచిపోయారు.

బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ (ప్రతీకాత్మక చిత్రం )
ఇపుడు ఈ బిగ్‌బాస్ సీజన్ 3 లో రాహుల్, శ్రీముఖి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరి ఎవరు విజేతగా నిలిచినా.. స్టార్ మా వాళ్లు ఇచ్చే ప్రైజ్ మనీ తీసుకుంటారు. రన్ రప్‌గా నిలిచినా వాళ్లు కొంచెం తక్కువ డబ్బులు ప్రైజ్ మనీ వస్తుంది. మరోవైపు అసలు బిగ్‌బాస్ వంటి పాశ్చాత్య పోకడ ఉన్న ప్రోగ్రామ్స్‌తో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని కొంత మంది సంప్రదాయవాదులు వాదిస్తున్నారు.

బిగ్‌బాస్ 3 తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ (StarMaa/Photo)
బిగ్‌బాస్ వంటి ప్రోగ్రామ్స్‌తో ఆడియన్స్‌కు తమ టైమ్ వేస్ట్ తప్ప మరేమి లేదని కూడా అంటున్నారు. దీనితో పిల్లలు,యువత చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ల విజేతలుగా నిలిచిన వీళ్లకు బిగ్‌బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం కలగలేదనే చెప్పాలి.తాజాగా బిగ్‌బాస్ 3 విజేతగా ఎవరు గెలిచిన వాళ్ల పరిస్థితి కూడా అంతకన్నా గొప్పగా ఏమి ఉండకపోవచ్చు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 3, 2019, 1:38 PM IST