Bigg Boss 3: ఈ వీక్ బిగ్‌బాస్ హౌస్ నుండి వితికా షేరు ఔట్..

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజుతో 12 వారాలు పూర్త చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు.ఈ వారం ఎలిమినేషన్‌లో..

news18-telugu
Updated: October 20, 2019, 10:00 PM IST
Bigg Boss 3: ఈ వీక్ బిగ్‌బాస్ హౌస్ నుండి వితికా షేరు ఔట్..
వితికా షేరు (StarMaa/Photo)
  • Share this:
నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజుతో 12 వారాలు పూర్త చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు.ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో వరుణ్ సందేశ్, వితికా షేరు, అలీరెజా నామినేట్ అయ్యారు. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ నాగార్జున కంటెస్టెంట్స్‌కు పెద్ద టాస్కే వచ్చాడు. అందులో భాగంగా శ్రీముఖి.. ఛార్మి నటించిన ‘అనగనగా ఒక రోజు’ సినిమాలోని పాటకు డాన్స్ చేసింది. మరోవైపు వితికా షేరు.. ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ సినిమాలోని అగ్గిపుల్ల లాంటి పాటకు డాన్స్ చేస్తే.. రాహుల్ .. ‘ముఠామేస్త్రీ’ లోని టైటిల్ సాంగ్‌కు చిందేసాడు. శివజ్యోతి కూడా చందమామ పాటకు డాన్స్ చేసింది. అలీ రెజా, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్‌ తమకిచ్చిన పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేసాడు. ఇంకోవైపు కళ్లకు గంతలు కట్టుకొనే టాస్క్‌లో వితికా,వరుణ్ సందేశ్ బాల్స్‌తో ఆడుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అలీ రజా, రాహుల్ కళ్లకు గంతలతో ఒకరినొకరు గుద్దుకున్నారు. ఈ క్రమంలో అందరి కళ్లకు గంతలు కట్టుకొని ఈ స్కిట్స్ చేసారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ముగ్గురిలో వితికా షేరు, వరుణ్ సందేశ్, అలీ రెజాల్లో ముందుగా అలీ రెజా సేఫ్ అయ్యాడు. ఇక భార్య భర్తలైన వరుణ్ సందేశ్, వితికా షేరుల్లో చివరికి వితికా షేరును ఎలిమినేట్ చేసాడు బిగ్‌బాస్. వితికా షేరు ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ భావోద్వేగానికి గురయ్యాడు.
First published: October 20, 2019, 10:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading